అహో “బిలం” అంతా అయోమయం

దైవానికి సైతం సొమ్ముల వివాదాలు తప్పడం లేదు. డబ్బు వివాదం చుట్టూ ప్రఖ్యాత అహోబిల క్షేత్రం నడుస్తుంది. లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఆదాయం ఎవరికి చెందాలన్న [more]

Update: 2019-06-26 07:30 GMT

దైవానికి సైతం సొమ్ముల వివాదాలు తప్పడం లేదు. డబ్బు వివాదం చుట్టూ ప్రఖ్యాత అహోబిల క్షేత్రం నడుస్తుంది. లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఆదాయం ఎవరికి చెందాలన్న అంశమే వివాదానికి దారి తీసింది. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం రెండు కూడా అహోబిల పీఠానికి చెందినవి. అయితే ఇందులో వచ్చిన ఆదాయం దేవాదాయ శాఖకు చెందాలని డిమాండ్ చేయడంతో పాటు ఇటీవల హుండీ ఆదాయాన్ని ఈవో ఖాతాకు జమ చేయించుకుంది. దాంతో మఠం దీనికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో సొమ్మును ఆంధ్ర బ్యాంక్ సస్పెన్సన్ లో ఉంచింది.

పోలీస్ స్టేషన్ లు, కోర్ట్ ల చుట్టూ …

తమకు రావలిసిన సొమ్ము దేవాదాయశాఖ కు అందించడం పై పీఠం పోలీస్ స్టేషన్ ఎక్కింది. మరోపక్క నిధులు సస్పెన్షన్ లో ఉండగా బ్యాంక్ మేనేజర్ పీఠం కు వాటిని బదలాయించడంపై దేవాదాయ శాఖ కోర్ట్ తలుపు తట్టింది. గతంలో ఈవో నిధులు దుర్వినియోగం వల్లే ఎప్పటిలా పీఠానికి మళ్లించినట్లు బ్యాంక్ అంటుంది. ఇలా ఎవరికి వారు దేవుడి సొమ్ము కోసం పోరాటం చేస్తూ ఉంటే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సౌకర్యాలను చూడలిసిన మఠం కానీ దేవాదాయ శాఖా వాటిని గాలికి వదిలి పోవడంపై విమర్శలు ఆరోపణలు ఎక్కుపెట్టారు. తక్షణం ప్రభుత్వం జ్యోక్యం చేసుకుని పూర్తి విచారణ జరిపి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News