ఆ వైసీపీ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ చెక్‌… వైసీపీలోకి టీడీపీ నేత‌

రాజ‌కీయాల్లో వ్యహ‌ప్రతివ్యూహాలు.. స‌హ‌జం. అయితే, ఇవి ప్రత్యర్థుల‌ను, ప్రత్యర్థి పార్టీల‌ను క‌ట్టడి చేసేందుకు వినియోగిస్తారు. కానీ, చిత్రంగా గ‌త కొన్నాళ్లుగా అధికార వైసీపీని గ‌మ‌నిస్తే.. సొంత పార్టీ [more]

Update: 2020-10-23 02:00 GMT

రాజ‌కీయాల్లో వ్యహ‌ప్రతివ్యూహాలు.. స‌హ‌జం. అయితే, ఇవి ప్రత్యర్థుల‌ను, ప్రత్యర్థి పార్టీల‌ను క‌ట్టడి చేసేందుకు వినియోగిస్తారు. కానీ, చిత్రంగా గ‌త కొన్నాళ్లుగా అధికార వైసీపీని గ‌మ‌నిస్తే.. సొంత పార్టీ నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇత‌ర పార్టీల నేత‌ల‌ను వైసీపీలోకి ఆహ్వానించి.. అధికార పార్టీ నేత‌ల దూకుడుకు బ్రేకులు వేస్తున్న ప‌రిణామాలు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. తాజాగా ఇదే వ్యూహంతో జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ అధినేత చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మంత్రి పదవి ఇవ్వలేదని….

క‌డ‌ప‌లోని ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం కీల‌క‌మైన స్థానం. ఇక్కడ టీడీపీకి నంద్యాల వ‌ర‌ద రాజుల రెడ్డి కీల‌క నేత‌గా ఉండేవారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన వెంట‌నే ఆయ‌న ఇక్కడ సైకిల్‌పై తిరిగి.. పార్టీని డెవ‌ల‌ప్ చేశార‌నే పేరుంది. ఈక్ర‌మంలోనే 1985లో టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. అనంత‌ర కాలంలో ఆయ‌న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అనుంగు అనుచ‌రుడిగా మారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే త‌ర్వాత ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్ పై వ‌రుస విజ‌యాలు అందుకున్నారు. 1989 నుంచి 2004 వ‌ర‌కు విజ‌యం సాధించిన ఆయ‌న‌కు వైఎస్ సీఎం అయ్యాక మంత్రి ప‌ద‌వి ఇవ్వలేద‌నే కోపంతో ఆయ‌న‌కు డిస్టెన్స్ పాటించారు.

టిక్కెట్ల విషయంలోనూ….

2004 ఎన్నిక‌ల త‌ర్వాత వైఎస్‌కు ఆయ‌న‌కు మ‌ధ్య తీవ్రమైన గ్యాప్ వచ్చింది. ఇది ఆయ‌న‌కు మ‌రింత ఇబ్బందిగా మారింది. 2009 ఎన్నిక‌ల్లోకాంగ్రెస్ త‌ర‌ఫున టికెట్ తెచ్చుకున్నా.. వైఎస్ వ‌ర్గం వ‌ర‌ద‌రాజులుకు వ్యతిరేకంగా చ‌క్రం తిప్పింది. దీంతో ఆయ‌న ఓడిపోయారు. త‌న ఓట‌మికి వైఎస్ కార‌ణమంటూ ర‌గిలిపోయారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నిక‌ల వేళ ఆయ‌న మ‌ళ్లీ టీడీపీ సైకిల్ ఎక్కారు. ఇక‌, 2014లో టీడీపీ టికెట్ తెచ్చుకున్నా. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సానుకూల‌త ఉన్నప్పటికీ వ‌ర‌ద రాజులు ఓడిపోయారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ కూడా ద‌క్కించుకోలేక‌పోయారు. ట్విస్ట్ ఏంటంటే 2014 ఎన్నిక‌ల్లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డిని కాద‌ని వ‌ర‌ద‌రాజ‌ల రెడ్డికి సీటు ఇచ్చిన చంద్రబాబు గ‌త ఎన్నిక‌ల్లో వ‌ర‌ద‌రాజుల‌ను కాద‌ని నాడు కాద‌న్న లింగారెడ్డికే సీటు ఇచ్చారు.

చెక్ పెట్టేందుకేనా?

ఇక 2014, 2019 ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీ దూకుడు పెంచింది. ఇక‌, ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నా.. త‌న‌కు ప్రాధాన్యం లేద‌ని గుర్తించిన వ‌ర‌ద‌రాజులు వైసీపీలోకి వ‌చ్చేందుకు ప్రయ‌త్నాలు సాగిస్తున్నార‌ట‌. ఇది ఆయ‌న వైపు వెర్షన్‌. ఇక‌, వైసీపీ నుంచి చూస్తే.. ఇక్కడ వ‌రుస విజ‌యాలు సాధించిన రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్‌రెడ్డిపై నియోజ‌క‌వ‌ర్గంలో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ నేత‌లే ఆయ‌న‌పై విమ‌ర్శలు చేస్తున్నారు. దీంతో ఆయ‌న‌కు నొప్పి తెలియ‌కుండా చెక్ పెట్టాల‌ని అధిష్టానం కూడా భావిస్తోంది. ఈ క్రమంలో వ‌ర‌ద‌రాజులును పార్టీలోకి తీసుకుని.. రాచ‌మ‌ల్లు రాజ‌కీయ దూకుడుకు చెక్ పెట్టేలా వ్యూహం సిద్ధం చేస్తున్నార‌ని అంటున్నారు. జ‌గ‌న్ ఆదేశానుసార‌మే ఇది జ‌రుగుతోందని కూడా క‌డ‌ప వైసీపీ వ‌ర్గాల మాట‌.

ఎప్పుడో నిర్ణయించినా….

వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న్ను పార్టీలోకి తీసుకోవాల‌ని వైసీపీ అధిష్టానం భావించింది. అయితే అప్పుడు అది వాయిదా ప‌డింది. ఇక జిల్లాలోని కొంద‌రు సీనియ‌ర్ వైసీపీ ఎమ్మెల్యేలు సైతం రాచ‌మ‌ల్లుకు చెక్ పెట్టేలా వ‌ర‌ద‌రాజుల‌ను పార్టీలోకి తీసుకు రావాల‌ని చూస్తున్నారు. మొత్తానికి అటు వ‌ర‌ద రాజులు ఆశ‌, ఇటు వైసీపీ వ్యూహం ఫ‌లించేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?చూడాలి.

Tags:    

Similar News