వైసీపీలో వీళ్లపై వేటుకు రంగం సిద్ధమయినట్లేనా?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఓ విష‌యం చ‌ర్చకు వ‌స్తోంది. అదే కీల‌క‌మైన నాయ‌కుల‌పై జ‌గ‌న్ ఆగ్రహంతో ఉన్నార‌ని, వారిపై చ‌ర్యల‌కు కూడా రంగం సిద్ధం చేస్తున్నార‌ని. [more]

Update: 2020-03-30 06:30 GMT

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఓ విష‌యం చ‌ర్చకు వ‌స్తోంది. అదే కీల‌క‌మైన నాయ‌కుల‌పై జ‌గ‌న్ ఆగ్రహంతో ఉన్నార‌ని, వారిపై చ‌ర్యల‌కు కూడా రంగం సిద్ధం చేస్తున్నార‌ని. అయితే, ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ కారణంగా ఈ విష‌యం ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్నా త‌ర్వాత ఆ నాయ‌కుల విష‌యంలో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంద‌ని అంటున్నారు. పార్టీలో సొంత లాభం చూసుకుని, అది ద‌క్కక పోయే స‌రికి పార్టీని దివాలా తీయించే ప‌నిచేసిన నాయ‌కుల‌పై చ‌ర్యలు త‌ప్పవ‌ని అంటున్నారు. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గగానే మ‌రో నెల నెల‌న్నర రోజుల్లోనే వీరిపై చ‌ర్యలు ఉంటాయ‌ని తెలుస్తోంది. అయితే, ఇప్పటికి ప్పుడు కాకుండా కాస్త ఆగి చ‌ర్యల‌కు రంగం సిద్ధం చేస్తున్నార‌ట‌.

పూర్తి అసంతృప్తిలో…..

విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగప‌డిన వారు, అదే విధంగా ఎమ్మెల్సీలు గా ప్రమోష‌న్ పొందుతామ‌ని భావించి భంగ ప‌డిన‌వారు, నామినేటెడ్ ప‌ద‌వులు ఆశించిన వారు. జిల్లా ప‌రిష‌త్ చైర్మన్ ప‌ద‌వులు ఆశించిన వారు వైసీపీలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి అనుకూలంగా వార్ అంతా వ‌న్‌సైడ్‌గా ఉంది. ఆ పార్టీ నేత‌ల‌కు వ‌చ్చే ప‌ద‌వులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అయితే పార్టీలో ప‌ద‌వులు ఆశించే వారు కోకొల్లులుగా ఉన్నారు. అయితే, ప్రభుత్వం వ‌చ్చి ప‌ది మాసాలు పూర్తి అయినా.. త‌మ‌కు ఎలాంటి న్యాయం జ‌ర‌గ‌లేద‌ని వీరు పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు.

పార్టీకి వ్యతిరేకంగా…..

ఈ నేప‌థ్యంలోనే అందివ‌చ్చిన అవ‌కాశంగా స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ను తీసుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపిని మెజారిటీ స్థానాల్లో గెలిపించాల‌ని కోరినా కూడా వారు జ‌గ‌న్ మాట‌ను పెడ‌చెవిన పెట్టారు. క‌డ‌ప‌, నెల్లూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ నాయ‌కులు చాప‌కింద నీరులాగా పార్టీకి వ్యతిరేకంగా ప‌నిచేశారు. దీంతో పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని ఆశించిన స్థానాల్లోనూ పార్టీ ఓడిపోయింది. మ‌రీ ముఖ్యంగా పార్టీకి హ్యాండిచ్చిన వారిలో ఒక మంత్రి కూడా ఉన్నారు. ఆ మంత్రి కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన‌కు రెండు ఎంపీటీసీ స్థానాల‌ను ఏక‌గ్రీవం చేసేందుకు తెర‌వెనుక మంత్రాంగం నెరిపార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నివేదిక అందిన తర్వాత..?

ఇప్పటికే స‌ద‌రు మంత్రికి జ‌గ‌న్ కొన్ని విష‌యాల్లో వార్నింగ్ ఇచ్చిన‌ప్పట‌కి ఇప్పుడు నేరుగా జ‌న‌సేన‌కు స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఎంపీటీసీలు ఏకగ్రీవం చేయ‌డంతో ఆ వ్యవ‌హారం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దృష్టికి కూడా వెళ్లింద‌ని అంటున్నారు. సుబ్బారెడ్డి సైతం స‌ద‌రు మంత్రి విష‌యంలో సీరియ‌స్‌గా ఉన్నార‌ట‌. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్సీ తీరుతో పాటు నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక‌రిని మ‌రొక‌రు దెబ్బేసుకునేందుకు చేసిన ప్రయ‌త్నాలు పార్టీకి న‌ష్టం క‌లిగించాయ‌ని అంటున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నిక‌ల‌పై సీఎం జ‌గ‌న్ నియ‌మించిన క‌మిటీలు ఇప్పటికే ఆయా లోపాలు, నేత‌ల వ్యవ‌హారంపై ఓ నివేదిక‌ను రూపొందించారు. దీనిని త్వర‌లోనే సీఎంకు ఇస్తార‌ని తెలిసింది. దీంతో వీరిపై చ‌ర్యలు తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News