ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే ఉంటుందా?

జయలలిత తర్వాత అన్నాడీఎంకే ను నడిపే నేత ఎవరు? ఈ ప్రశ్నకు ఇంత వరకూ సమాధానం లేదు. జయలలిత అధికారం చేతిలో పెట్టి వెళ్లారు కాబట్టి పార్టీ [more]

Update: 2021-01-29 17:30 GMT

జయలలిత తర్వాత అన్నాడీఎంకే ను నడిపే నేత ఎవరు? ఈ ప్రశ్నకు ఇంత వరకూ సమాధానం లేదు. జయలలిత అధికారం చేతిలో పెట్టి వెళ్లారు కాబట్టి పార్టీ ఇన్నాళ్లూ మనగలిగింది. రేపటి ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత అన్నాడీఎంకే కనుమరుగు కాక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. జయలలిత తరహాలో ప్రభావం చేసే నేత అన్నాడీఎంకే లో లేరు. ఈ పరిస్థితుల్లో కొంతకాలం పార్టీ మనుగడ సాగించాలంటే శశికళను పార్టీలో చేర్చుకోవడమే బెటర్ అన్న డిమాండ్ పెరుగుతుంది.

అన్ని రకాల సర్వేలు…

అన్ని రకాల సర్వేలు డీఎంకే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకే కూటమి బలహీనంగా ఉందన్నది వాస్తవం. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో సహజంగా ఏర్పడే వ్యతిరేకత కూడా పార్టీ అధికారంలోకి రాలేదనడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో శశికళను పార్టీలోకి తీసుకురావాలన్న డిమాండ్ సొంత పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. అప్పుడే డీఎంకే కు దీటుగా బదులివ్వగలమని పలువురు సీనియర్ నేతలు సయితం సూచిస్తున్నారు.

వత్తిడి పెరుగుతున్నా…..

జయలలిత సన్నిహితురాలు శశికళను అన్నాడీఎంకే లో చేర్చుకోవడంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అయితే ఆమెను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి చేర్చుకోకూడదన్న నిర్ణయానికి వచ్చారు. ఎవరి నుంచి ఎన్ని వత్తిడులు వచ్చినా శశికళకు పార్టీలో స్థానం లేదని పళనిస్వామి తేల్చి చెప్పేశారు. అన్నాడీఎంకే లోకి శశికళను చేర్చుకున్న అనంతరం అంతా ఆమె చేతిలోకి వెళ్లిపోతుందన్నది వాస్తవం. ఆర్థికంగా బలంగా ఉన్న శశికళను నిలువరించడం ఎవరి వల్లా కాదు.

ఎన్నికల తర్వాతే….?

అయితే కూటమిలోని కొన్ని పార్టీలు కూడా శశికళను అన్నాడీఎంకేలోకి తీసుకోవాలని వత్తిడి తెస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వకపోయినా ఆమెను పార్టీలోకి తీసుకుంటే కొంత సానుకూలత వస్తుందని చెబుతున్నారు. కూటమిలోని బీజేపీ సయితం ఇదే అభిప్రాయంలో ఉంది. కాని పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ఇద్దరూ అందుకు అంగీకరించడంలేదు. గత మూడున్నరేళ్లుగా తమ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో వారు అంగీకరించే అవకాశమే లేదు. ఎన్నికల అనంతరం ఫలితాలను బట్టి శశికళను చేర్చుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయంటున్నారు.

Tags:    

Similar News