సూపర్ సీఎం స్టాలిన్… మెచ్చుకోకుండా ఉండలేం

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కొత్త పోకడలకు శ్రీకారం చుట్టారు. తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని విధమైన పరిస్థితిని ఆయన కనపర్చారు. స్టాలిన్ వ్యవహార [more]

Update: 2021-05-23 17:30 GMT

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కొత్త పోకడలకు శ్రీకారం చుట్టారు. తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని విధమైన పరిస్థితిని ఆయన కనపర్చారు. స్టాలిన్ వ్యవహార శైలి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు పాలిటిక్స్ లో స్టాలిన్ సరికొత్త అధ్యాయానికి తెరతీయనున్నారని అంచనా విన్పిస్తుంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ సుపరిపాలన అందించేందుకు సిద్దమయ్యారు.

ఇబ్బంది పెట్టడమే…?

తమిళనాడు పాలిటిక్స్ అంటే అందరికీ తెలిసిందే. ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పాలన సాగుతుంది. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నా, జయలలిలత సీఎంగా ఉన్నా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు కన్పించేవి. ఎంతగా అంటే ఒకరి ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలకు మరొకరు వెళ్లరు. నిత్యం ఘర్షణలతోనే సమయాన్ని గడుపుతుంటారు. అభివృద్ధి పైకంటే ప్రత్యర్థి పార్టీని అణగదొక్కేందుకే ఎక్కువగా తాపత్రయపడుతుంటారు. కానీ స్టాలిన్ మాత్రం ఇప్పుడు భిన్నంగా కన్పిస్తున్నారు.

అందరినీ కలిసి….

స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే విపక్ష సభ్యులను కలిశారు. వారి వద్దకు వెళ్లి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. బలంలేని వామపక్ష పార్టీలను సయితం స్టాలిన్ కలసి తనకు మద్దతుగా నిలవాలని స్టాలిన్ కోరడం విశేషం. ఇక స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న అమ్మ క్యాంటిన్లు కొనసాగుతాయని స్టాలిన్ ప్రకటించారు. కష్టసమయాల్లో కడుపు నింపే అమ్మ క్యాంటిన్లను మూసివేసే ఉద్దేశ్యం లేదని స్టాలిన్ చేసిన ప్రకటన సొంత పార్టీలోనూ చర్చనీయాంశమైంది.

అమ్మ క్యాంటిన్లను…

ఇది ఒక రకంగా స్టాలిన్ కు మేలు చేసేదే. అమ్మ క్యాంటిన్లను కొనసాగించడం ద్వారా ప్రత్యర్థి అన్నాడీఎంకే పార్టీకి నోట మాట రాకుండా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి జయలలిత ఇమేజ్ అన్నాడీఎంకేకు పనిచేయకూడదనే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఇది తెలివైన నిర్ణయంగా ప్రత్యర్థులు కూడా స్టాలిన్ ను అభినందిస్తున్నారు. మొత్తం మీద స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే కక్ష సాధింపు చర్యలకు కాకుండా కలుపుకుని పోతుండటం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News