కూటమి కడతారా? సీట్ల సర్దుబాటు సాధ్యమయ్యేనా?

బీహార్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అధికార ఎన్డీఏ కూటమి ఫుల్ జోష్ లో ఉంది. సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి వచ్చినట్లే. కానీ [more]

Update: 2020-09-25 18:29 GMT

బీహార్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అధికార ఎన్డీఏ కూటమి ఫుల్ జోష్ లో ఉంది. సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి వచ్చినట్లే. కానీ మహా ఘట్ బంధన్ లోనే ఇంకా సీట్ల సర్దుబాబు ఒక కొలిక్కి రాలేదు. దీనికి ప్రధాన కారణం కూటమిలోని అన్ని పార్టీలూ ఎక్కువ సీట్లు ఆశిస్తుండటమే. మహా ఘట్ భంధన్ లోని రాష్ట్రీయ జనతాదళ్ అత్యధిక స్థానాలను కోరుకుంటుంది. ఇందులో తప్పులేదు. కానీ చిన్నా చితకా పార్టీలు కూడా సీట్ల విషయంలో మంకు పట్టుకుని కూర్చున్నాయి. దీంతో విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం ఆందోళన కల్గిస్తుంది.

ఆర్జేడీ ఎక్కువ స్థానాల్లో గెలిచి…

గత ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే అప్పుడు ఆర్జేడీ వంద స్థానాల్లో పోటీ చేసింది. 82 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఒప్పందం మేరకు నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 43 స్థానాల్లో పోటీ చేసి 27 స్థానాల్లో గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను ఆశిస్తుంది. జేడీయూ ఉన్నందున గత ఎన్నికల్లో తాము తక్కువ స్థానాల్లో పోటీ చేశామని ఇప్పుడు జేడీయూ లేదు కాబట్టి తాము ఎక్కవ స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతోంది.

అధిక స్థానాలను ఆశిస్తూ….

బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం విపక్ష కూటమిలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీతో పాటు వామపక్షాలు కూడా ఉన్నాయి. వామపక్షాలతో పాటు 16 దాకా చిన్నా చితకా పార్టీలున్నాయి. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై వ్యతిరేకత ఉన్న కారణంగా ఎక్కువ స్థానాలు తమకు ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. వామపక్ష పార్టీలకు కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో సీట్ల విషయంలో చర్చలు జరుపుతున్నారు. గత ఎన్నికల్లో సీపీఎం మూడు సీట్లను గెలుచుకుంది.

చికాకు పడుతున్న తేజస్వి…..

దీంతో రాష్ట్రీయ జనతాదళ్ కు నేతృత్వం వహిస్తున్న తేజస్వి యాదవ్ కు చికాకు తెప్పిస్తుంది. 234 స్థానాల్లో తాము 140 స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్నట్లు తేజస్వి యాదవ్ చెప్పారు. ఇందుకు కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలు అంగీకరించడం లేదు. కాంగ్రెస్ ఈసారి గట్టిగానే డిమాండ్ చేస్తుంది. చివరి నిమిషం వరకూ విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. మొత్తం మీద బీహార్ లో విపక్ష కూటమి సీట్ల సర్దుబాటులో కిందా మీదా పడుతుంది.

Tags:    

Similar News