ఆదికి ఆ అవసరం ఎందుకు?

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి జంప్ అవుతున్నారు. ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని వీడటానికి ఆదినారాయణరెడ్డికి ఏం అవసరమొచ్చింది? నిజంగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2019-08-19 06:30 GMT

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి జంప్ అవుతున్నారు. ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని వీడటానికి ఆదినారాయణరెడ్డికి ఏం అవసరమొచ్చింది? నిజంగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో అంత సీన్ ఉందా? అదీగాక జగన్ సొంత జిల్లాలో కమలం పార్టీకి అసలు ఆదరణ ఉంటుందా? ఆదినారాయణరెడ్డి ఈ నిర్ణయం వెనక కారణాలు ఏమై ఉంటాయి? ఇదే విషయం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

పరాజయం పాలయి….

ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆదినారాయణరెడ్డి షరతులతో టీడీపీలో చేరారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని పెట్టిన ఆయన డిమాండ్ ను అప్పట్లో చంద్రబాబు ఓకే చెప్పారు. తర్వాత తన ఆగర్భ శత్రువు రామసుబ్బారెడ్డితో కూడా చేతులు కలపడానికి సిద్ధమయ్యారు. గత ఎన్నికలలో జమ్మలమడుగు సీటు ఇవ్వకపోయినా కడప ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. జమ్మలమడుగులోనూ టీడీపీ ఓటమి పాలయింది. రాష్ట్రంలో జగన్ సర్కార్ వచ్చింది.

ఎన్నికల ఖర్చు…..

అయితే ఆదినారాయణరెడ్డి గత కొంతకాలంగా చంద్రబాబుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఖర్చు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఇవ్వలేదట. చంద్రబాబు అనంతపురం పర్యటనకు వెళుతూ కడప విమానాశ్రయంలో ఆగినా ఆదినారాయణరెడ్డి మొహం చాటేశారు. తర్వాత మధ్యవర్తుల ద్వారా చంద్రబాబు రాయబారం పంపారు. కొంత అమౌంట్ సర్దుబాటు చేసినా చంద్రబాబు చెప్పిన మొత్తం ఇవ్వలేదని ఆదినారాయణరెడ్డి అసహనంతో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

కేసుల భయమేనా…?

కానీ ఆదినారాయణరెడ్డి పార్టీని వీడాలన్న ఆలోచనకు ఇది ఒక్కటే కారణం కాదంటున్నారు. జమ్మలమడుగులో బీజేపీకి బలం లేదని తెలిసినా ఆదినారాయణరెడ్డి ఆ పార్టీలో చేరడానికి కేసుల భయమే కారణమన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్ వివేకాహత్యతో పాటు మరి కొన్ని కేసుల పట్ల ఆదినారాయణరెడ్డి భయపడుతున్నట్లు తెలుస్తోంది. తనపై జగన్ సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తుందేమోనన్న బెంగతోనే ఆయనబీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు.

Tags:    

Similar News