Bjp : ఆది అంత శుద్దపూసలా కనిపిస్తున్నాడా?

భారతీయ జనతా పార్టీలో కొందరికే ప్రాధాన్యత దక్కుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారిలో ఇక్క ఆదినారాయణరెడ్డికే ప్రయారిటీ ఇస్తుంది. వైసీపీ రెడ్డి, టీడీపీ [more]

Update: 2021-10-22 05:00 GMT

భారతీయ జనతా పార్టీలో కొందరికే ప్రాధాన్యత దక్కుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారిలో ఇక్క ఆదినారాయణరెడ్డికే ప్రయారిటీ ఇస్తుంది. వైసీపీ రెడ్డి, టీడీపీ కమ్మ, జనసేన కాపుల పార్టీలుగా ఎవరు అవునన్నా కాదన్నా ముద్రపడిపోయాయి. బీజేపీకి ఇప్పటి వరకూ ఎలాంటి ముద్ర లేదు. కన్నా, సోము వీర్రాజు పార్టీ అధ్యక్షులయిన తర్వాత కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నారని మాత్రం అనుకున్నారు. అయితే బీజేపీ పై ఎలాంటి కుల ముద్ర పడకపోయినా ఒక సామాజికవర్గం నేతలను మాత్రం టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

మిగిలిన నేతలను….

ఇందులో ప్రధానంగా ఆదినారాయణరెడ్డిని దగ్గరకు తీసుకోవడం, టీడీపీ నుంచి వచ్చిన ఇతర నేతలను దూరం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆదినారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యేగా పార్టీలో చేరారు. కానీ సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లు రాజ్యసభ సభ్యులుగా టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. కానీ ఈ ముగ్గురికి దక్కని ప్రాధాన్యత ఆదినారాయణరెడ్డికి దక్కుతుండటం విశేషం. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

ముగ్గురూ గట్టి వారే అయినా?

ఆర్థికంగా, రాజకీయంగా ఆ ముగ్గురు గట్టివారు. వారు ముగ్గురు రాష్ట్ర వ్యాప్త నాయకులుగా ముద్రపడ్డారు. ఆదినారాయణరెడ్డి ఒక జమ్మలమడుగు నియోజకవర్గానికి మాత్రమే చెందిన నేత. అయినా ఆదినారాయణరెడ్డికి ఇచ్చిన ప్రయారిటీ ఈ ముగ్గురికి లేదు. పోనీ ఆదినారాయణరెడ్డికి కమిట్ మెంట్ పార్టీ పట్ల ఉందా? అంటే అదీ డౌటే. కేవలం ఈ ముగ్గురు చంద్రబాబుకు దగ్గరగా ఉన్నారన్న ఏకైక కారణంతో బీజేపీ నాయకత్వం దూరం పెడుతుంది.

అయినా ఎందుకో?

ఇందులో టీజీ వెంకటేష్ తన వారసుడిని టీడీపీలో కొనసాగిస్తుండటం ఒక కారణం. సీఎం రమేష్, సుజనా చౌదరిలు చంద్రబాబుకు మద్దతుదారులేనన్న అనుమానం ఉంది. ఇక ఆదినారాయణరెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. అయితే ఆయన అన్న కుమారుడే జమ్మలమడుగు ఇన్ ఛార్జిగా చంద్రబాబు నియమించారు. అయినా ఆదినారాయణరెడ్డికి మిగిలిన వారికంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఆదినారాయణరెడ్డి వచ్చే ఎన్నికలలో బీజేపీ నుంచి తన అన్నకొడుకు మీద పోటీ చేస్తారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మొత్తం మీద బీజేపీలో కొందరు నేతలను మాత్రం టార్గెట్ చేసినట్లు కనపడుతుంది.

Tags:    

Similar News