కండువాలే కలసి రావడం లేదా?

జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డికి భవిష్యత్ లో రాజకీయాలు కలసి రావనే అనిపిస్తుంది. ఆదినారాయణరెడ్డి పదే పదే పార్టీలు మారడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పాలి. ఆదినారాయణరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో [more]

Update: 2021-05-08 09:30 GMT

జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డికి భవిష్యత్ లో రాజకీయాలు కలసి రావనే అనిపిస్తుంది. ఆదినారాయణరెడ్డి పదే పదే పార్టీలు మారడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పాలి. ఆదినారాయణరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక పోయారు. వచ్చే ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి తిరిగి టీడీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో సాధారణ ప్రజల్లో ఆయన గ్రాఫ్ బాగా పడిపోయినట్లు తెలుస్తోంది.

వైఎస్ దగ్గరకు తీసి….

జమ్మలమడుగు అనగానే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గుర్తుకొస్తారు. లెక్చరర్ గా ఉన్న ఆదినారాయణరెడ్డిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి తెచ్చారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. అనంతరం వైఎస్ జగన్ పార్టీలో చేరి 2014లో మళ్లీ గెలిచారు. కానీ మంత్రి పదవిపైన ఉన్న ఆశ, జగన్ ఇక అధికారంలోకి రారన్న నమ్మకంతో ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిపోయారు.

బీజేపీలో చేరి…..

అయితే మొన్నటి ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డికి టీడీపీ జమ్మలమడుగు టిక్కెట్ ఇవ్వకుండా కడప ఎంపీగా పోటీ చేయించింది. అక్కడ ఓటమి పాలయ్యారు. అయితే జగన్ అధికారంలో ఉండటంతో కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీలోకి ఆదినారాయణరెడ్డి చేరిపోయారు. ప్రస్తుతం జమ్మలమడుగు బీజేపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిన తర్వాత ఆయన చిరకాల ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి వైసీీపీలో చేరారు. ప్రస్తుతం జమ్మలమడుగులో టీడీపీ లేదనే చెప్పాలి.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి….

అయితే ఇటీవల జరిగిన ఎన్నికలు ఆదినారాయణరెడ్డికి షాక్ ఇచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో కేవలం రెండు వార్డులను మాత్రమే ఆదినారాయణరెడ్డి గెలిపించుకోగలిగారు. జమ్మలమడుగు మున్సిపాలిటీలో 20 వార్డులుండగా 18 లో వైసీపీ విజయం సాధించింది. రెండు చోట్ల బీజేపీ గెలిచింది. ఈ ఫలితాలతో ఆదినారాయణ రెడ్డిలో అంతర్మధనం మొదలయిందంటున్నారు. పార్టీలు పదే పదే మారడం వల్లనే ఆదినారాయణరెడ్డిని ప్రజలు విశ్వసించడం లేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆదినారాయణరెడ్డి బీజేపీ నుంచి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయరన్నది వాస్తవం. ఇక ఆయనకు మిగిలింది టీడీపీయే. టీడీపీకి కూడా ఆదినారాయణరెడ్డి అవసరం ఉండటంతో ఆయన ఎప్పుడొచ్చినా రెడ్ కార్పెట్ పరుస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఆదినారాయణరెడ్డి వరసగా కండువాలు మారుస్తుండటమే కలసి రావడం లేదంటున్నారు.

Tags:    

Similar News