నియోజ‌క‌వ‌ర్గం మార్చండి సార్‌.. మంత్రిగారి రిక్వెస్ట్

“నియోజ‌క‌వ‌ర్గం మార్చేయండి సార్‌.. ప‌డ‌లేక పోతున్నా!“.. ఈ మాట అన్నది ఏ చిన్న.. స‌న్నకారు ఎమ్మెల్యే కాదు..ఏకంగా ఓ మంత్రి. అందునా.. ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులైన [more]

Update: 2021-05-04 15:30 GMT

“నియోజ‌క‌వ‌ర్గం మార్చేయండి సార్‌.. ప‌డ‌లేక పోతున్నా!“.. ఈ మాట అన్నది ఏ చిన్న.. స‌న్నకారు ఎమ్మెల్యే కాదు..ఏకంగా ఓ మంత్రి. అందునా.. ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులైన మంత్రి. ఆయ‌నే ఆదిమూల‌పు సురేశ్‌. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయ‌న.. 2019 ఎన్నిక‌ల్లో ప్రకాశం జిల్లా ఎర్రగొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అయితే.. నిల‌క‌డ‌గా ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఉండ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో పెద్దగా నియోజ‌క‌వ‌ర్గంపై కాన్సన్‌ట్రేట్ చేయ‌ర‌నే వ్యాఖ్యలు కూడా ఆయ‌న గురించి వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆయ‌న ఈ మాట అన‌డం వెన‌క కూడా అనేకానేక కార‌ణాలు ఉన్నాయి.

బెర్త్ లు రిజర్వ్ చేసుకుంటూ….

ఇప్పుడు ఉన్నప‌ళాన ఎందుకు నియోజ‌క‌వ‌ర్గం మార్చమ‌ని అడుగుతున్నారు? ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు క‌దా.. అంటే.. నిజ‌మే. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం.. ఇప్పటి నుంచి ప్రకాశం జిల్లాలో బెర్త్‌లు రిజ‌ర్వ్ చేసుకుంటున్నార‌ట‌.. కీల‌క నేత‌లు. ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న ఓ నేత ద‌గ్గర క‌నీసం ముగ్గురు నుంచి న‌లుగురు వ‌ర‌కు ఆఫ‌ర్లు ఉన్నాయ‌ట‌. జిల్లాలో కొన్ని రిజ‌ర్వ్‌డ్ సీట్లలో మార్పులు, చేర్పులు త‌ప్పేలా లేవు. దీంతో ఈ సీట్లపై క‌న్నేసిన కొంద‌రు ఉన్నత ఉద్యోగులు జిల్లాకే చెందిన స‌ద‌రు కీల‌క మంత్రి ద‌గ్గర‌కు క్యూ క‌డుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ సీటు త‌మ‌కే వ‌చ్చేలా చేయాల‌ని కోరుతున్నార‌ట‌.

నియోజకవర్గంపై…?

జిల్లాలో రెండు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నికల్లో పోటీ చేసిన‌ నేత‌ల‌కు మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా సీట్లు రావంటున్నారు. దీనికి సురేష్‌కు లింక్ ఏంట‌న్నది పరిశీలిస్తే ఆస‌క్తిక‌ర ప‌రిణామ‌మే ఉంది. ప్రస్తుతానికి ఎర్రగొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌పై వ‌స్తున్న వ‌త్తిడులు త‌ట్టుకోలేక పోతున్నారు. మంత్రిగా బిజీగా ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంపై స‌హ‌జంగానే ఆయ‌న దృష్టి పెట్టలేక పోతున్నారు. దీంతో ఎర్రగొండ‌పాలెంలో గ్రూపు రాజ‌కీయాలు పెరిగిపోయాయి. మంత్రికి వ్యతిరేకంగా ఓ గ్రూపు క‌ట్టి.. ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లో కొంద‌రు హ‌ల్‌చ‌ల్ చేశారు. ఈ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీలో ఓ సామాజిక వ‌ర్గం నేత‌ల దూకుడు ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింది. పార్టీలోనే ఎక్కువ మంది రెబ‌ల్స్ త‌యార‌య్యారు.

ఓ సామాజికవర్గం…..

సురేష్ సీఎం స్థాయిలో ఒత్తిడి చేస్తే త‌ప్పా వారు తెన‌క్కు త‌గ్గలేదు. దీంతో వారు ప్రస్తుతానికి త‌ప్పుకొన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. త‌న‌కు ఈ సెగ మ‌రింత పెరుగుతుంద‌ని భావిస్తున్న సురేశ్.. త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గం వ‌ద్దని.. మార్చాల‌ని ఓ మాట సీఎం చెవిలో వేశార‌ట‌. సురేష్ 2009లో ఎర్రగొండ‌పాలెం ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆ త‌ర్వాత 2014లో సంత‌నూత‌ల‌పాడులో వైసీపీ నుంచి గెలిచారు. అక్కడ చాలా ప్రశాంతమైన వాతావ‌ర‌ణం ఉండేద‌ని.. పార్టీలో గ్రూపులే ఉండేవి కావ‌ని.. ఎర్రగొండ‌పాలెం వ‌చ్చి చాలా త‌ల‌నొప్పులు తెచ్చుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న వాపోతున్నార‌ట‌.

సంతనూతలపాడును…?

ఈ క్రమంలోనే జిల్లాకే చెందిన స‌ద‌రు కీల‌క నేత సంత‌నూత‌ల‌పాడును పార్టీలో ఔత్సాహికుల‌కు రిజ‌ర్వ్ చేసే అవ‌కాశం ఉండడంతో…. సురేష్ ముందుగానే జ‌గ‌న్ చెవిలో నియోజ‌క‌వ‌ర్గం మార్పుపై ఓ మాట వేశార‌ట‌. ( ప్రస్తుత సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్‌. సుధాక‌ర్ బాబు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. వ‌చ్చే ఎన్నిక‌ల్ల ఇక్కడ నుంచి ఆయ‌న త‌ప్పుకోవ‌చ్చని టాక్ ? ) అయితే.. సీఎం జ‌గ‌న్.. దీనిని జోక్‌గా తీసుకున్నార‌ని పార్టీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Tags:    

Similar News