అంతా అదానీదే… సంపద చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్

స్వతంత్రం వచ్చిన తొలిరోజుల్లో టాటా, బిర్లాలు ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా గుర్తింపు పొందారు. దేశ పారిశ్రామిక ప్రగతిలో వారు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ వారు తమ [more]

Update: 2021-04-09 16:30 GMT

స్వతంత్రం వచ్చిన తొలిరోజుల్లో టాటా, బిర్లాలు ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా గుర్తింపు పొందారు. దేశ పారిశ్రామిక ప్రగతిలో వారు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ వారు తమ ప్రస్తానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 1980 ప్రాంతంలో థీరుాబాయి అంబానీ తెరపైకి వచ్చారు. అనతికాలంలోనే ఆయన అంచలంచెలుగా ఎదుగుతుా పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. అనంతరం ఆయన కుమారుడు ముుకేష్ అంబానీ వివిధ రంగాల్లో విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా దేశ పారిశ్రామిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ అదానీ విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా పరుగులు తీస్తున్నారు.

సంపద సృష్టిలో…..

గతకొంతకాలంగా అదానీ గాలి వేగంగా వీస్తోంది. సంపద సృష్టిలో అగ్రగామిగా నిలుస్తోంది. అహ్మదాబాద్ కు చెందిన ఈ పారిశ్రామికవేత్త ప్రస్తుత ఆస్తి అక్షరాలా రు.3.65 లక్షల కోట్లు. అంతర్జాతీయ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 5000 కోట్ల డాలర్లు. బ్లూమ్ బర్గ్ బీలీనియర్స్, ఇండెక్స్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. తద్వారా టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్ధాపకుడు జెఫ్ బోజెస్ ల కంటే వేగంగా అదానీ సంపదను ఆర్జించారు. ఆసియా అత్యధిక సంపన్నుడైన రిలయన్స అధినేత ముకేష్ అంబానీ ఆస్తి 810 కోట్ల డాలర్లకు పెరగ్గా, అదానీ ఆస్తి రు.16.20 కోట్ల డాలర్లు పెరగడం గమనించ దగ్గ విషయం.

శరవేగంగా విస్తరిస్తూ…..

డిగ్రి కుాడా పూర్తిచేయని అదానీ గ్రూప్ కంపెనీలు అనేక రంగాల్లో శరగవేగంగా విస్తరిస్తోంది. స్టాక్ మార్కెట్లో గ్రావ్ కంపెనీల షేర్ల ధరలు రెట్టింపయ్యాయి. కీలక రంగాలైన మౌలిక సౌకర్యాలు గ్యాస్, ఇంధనం, రవాణా, నౌక రవాణా, విమానాశ్రమాలు . . . ఇలా వివిధ విభాగాల్లో ప్రత్యేకమైన పనితీరును కనబరుస్తుా దూసుకుపోతున్నాయి. ఆయారంగాల్లో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా, కొత్త ప్రాజెక్టులను కొనుగోలు చేస్తుా అదానీ గ్రూవ్ ముందుకు సాగుతోంది. జీవీకే గ్రావ్ నుంచి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. దేశంలో ప్రముఖ విమానాశ్రయాల్లో ఇది ఒకటి. ఒకప్పుడు శాంతాక్రేజ్ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన దీని పేరు తరువాత ఛత్రపతి శవాజీ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారింది .మంగుళూరు, కోచి విమానాశ్రయాలుకుాడా అదానీ గ్రూవ్ పరిధిలోనే ఉన్నాయి. నెల్లుారు జిల్లాలోని కృష్టపట్నం ఓడరేవును నవయుగ గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది. ఏపీలోని గంగవరం నౌకాశ్రయం కుాడా అదానీ గ్రూప్ వశమైంది. డేటా సెంటర్ల స్ధాపనకు నడుంకట్టడం ద్వారా టెక్నాలజీ ఆధారిత వ్వాపారాల్లోనూ ప్రవేశించింది. ఒక గిగావాట్ సామర్ధ్యంగల డేటాసెంటర్లు ఏర్పాటుచేసేందుకు ఇటీవల ఒప్పందాలు చేసుకుంది

అన్నింటా అదానీయే….

అదానీ గ్రూప్ కంపేనీల విలువ చుాస్తే ఎవరికైనా కళ్ళుతిరగకమానవు 1800 కోట్ల డాలర్లలో అదానీ గ్రూప్ ఎనర్జీ ప్రధమ స్ధానంలో ఉంది. 900 కోట్ల డాలర్లతో అదానీ ఫోర్స్ అండ్ సెజ్ ద్వితీయ స్ధానంలో ముందుకు సాగుతోంది. అదానీ టోటల్ గ్యాస్ 800 కోట్ల డాలర్లు, అదానీ ఎంటర్ ప్రైజెస్ 800 కోట్ల డాలర్లు, అదానీ ట్రాన్స్ మిషన్ 600 కోట్ల డాలర్లు, అదానీ పవర్ 200 కోట్ల డాలర్ల విలువతో ప్రగతిపధంలో ముందుకు సాగుతున్నాయి. కంపెనీల విలువ పెరగడంతో అదానీ వ్యక్తిగత సంపద కుాడా పెరిగింది. దేశంలోని మరికొన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను కూడా హస్తగతం చేసుకునే ఆలోచనలో అదానీ ఉన్నట్లు పారిశ్రామికవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

చదువులో రాణించకపోయినా…..

చదువులో పెద్దగా ప్రతిభావంతుడు కానప్పటికి వ్యాపారంలో విశేష ప్రతిభ కనబరిచారు అదానీ. పకడ్బందీ ప్రణాళిక, వ్యూహరచన, ప్రత్యర్ధులకు అందని అంచనాలతో ముందుకు వెళ్ళడం ఆయనకు అలవాటు. భవిష్యత్తులో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీని అధిగమించాలన్నది అదానీ ఆలోచనగా చెబుతారు. కేంద్ర సర్కారు చల్లని చుాపుతోనే అదానీ గ్రావ్ దినదిన ప్రవర్ధమానమవుతోందన్న వాదన, విమర్శ, ఆరోపణ పారిశ్రామిక వర్గాల్లో లేకపోలేదు. గుజరాత్ కు చెందిన అదానీ ప్రధాని మెాదీకి సన్నిహితుడన్న ప్రచారం ఉంది. అదానీ గ్రూప్ పరిధిలోని వివిధ కంపెనీలను వృద్ధిచేయడం, విస్తరించడంతోపాటు భవిష్యత్తులో కొత్త రంగాల్లోకి అడుగు పెట్టాలన్న ఆలోచనలో అదానీ ఉన్నట్లు సమాచారం. ఉత్తర, పశ్చిమ భారతంతో పాటు, దక్షిణాదిన మరింత విస్తరించాలన్నది గ్రూప్ ఆలోచన. ఇప్పటికే పోర్టుల కొనుగోలు ద్వారా ఏపీ, విమానాశ్రయాల ద్వారా కర్నాటక, కేరళ లో వ్యాపార కార్యక్రలాపాలు సాగిస్తోంది. మున్ముందు తమిళనాడుపైనా దృష్టిపెట్టే అవకాశం లేకపోలేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News