ఆదాల కు బ్యాడ్ టైం నడుస్తుందా?

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఫుల్లు స్వింగ్ లో ఉండేవారు. ఓటమి పాలయినా అప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. కానీ పార్టీ మారి గెలిచి అధికారంలోకి [more]

Update: 2020-09-10 02:00 GMT

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఫుల్లు స్వింగ్ లో ఉండేవారు. ఓటమి పాలయినా అప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. కానీ పార్టీ మారి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. ఆయన నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒకనాడు ఒక ఊపు ఊపిన ఆదాల ప్రభాకర్ రెడ్డి నేడు సైలెంట్ కావడానికి కారణమేంటి? ఈ చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతుంది.

చివరి నిమిషంలో….

నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డితో ఎప్పుడూ తలపడేవారు. 2014 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అనేక కాంట్రాక్టులు పొందారు. వందల కోట్ల కాంట్రాక్టులు పొందారు. బాగా తెలివైన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో చంద్రబాబుపై వత్తిడి తెచ్చి తన బిల్లులను వందకోట్లను మంజూరు చేయించుకున్నారు. అప్పటి వరకూ చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా వ్యవహరించారు. చంద్రబాబు నెల్లూరు రూరల్ టిక్కెట్ ను కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు.

మేకపాటిని పక్కన పెట్టి మరీ….

అయితే చివరి నిమిషంలో తనకు టీడీపీ ఇచ్చిన బీఫారంను పక్కన పెట్టేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. తన వెన్నంటే నిలచిన మేకపాటి రాజమోహన్ రెడ్డిని పక్కన పెట్టి మరీ జగన్ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. నెల్లూరులో పది అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ, ఆదాల గెలుపునకు కూడా కారణమయింది. అయితే గెలిచిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి అందుబాటులో లేకుండా పోయారు.

ఎవరూ పట్టించుకోక పోవడంతో….

దీనికి ప్రధానకారణం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట చెల్లుబాటు కాకపోవడమే. మేకపాటి కుటుంబంతో పాటు ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హావాయే నడుస్తుండటంతో ఆదాల సైలెంట్ అయ్యారంటున్నారు. దీంతో పాటు కొత్తగా కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. ఇరిగేషన్ మినిస్టర్ జిల్లాకు చెందిన వారైనా తనను పట్టించుకోవడం లేదు. ఇలా అన్ని రకాలుగా తనను గుర్తించడం లేదని భావించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి మౌనమే మేలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

Tags:    

Similar News