అందరిదీ ఒక రూటయితే…. ఆదాలది మాత్రం?

నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి. పారిశ్రామిక వేత్త. బడా కాంట్రాక్టరు. కానీ కరోనా సమయంలో ఆయన పత్తా లేకుండా పోయారు. నెల్లూరు జిల్లాలో కరోనా [more]

Update: 2020-05-01 13:30 GMT

నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి. పారిశ్రామిక వేత్త. బడా కాంట్రాక్టరు. కానీ కరోనా సమయంలో ఆయన పత్తా లేకుండా పోయారు. నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతన్నాయి. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారితో కేసుల సంఖ్య పెరిగిపోయింది. తొలి కరోనా కేసు నెల్లూరులోనే నమోదయింది. అయితే ఆ యువకుడు కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లారు. నెల్లూరుకు చెందిన వైద్యుడు కూడా కరోనా కారణంగా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలంతా సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు.

నెల రోజుల నుంచి….

కానీ నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం వీటన్నింటికి దూరంగా ఉన్నారు. ఆయన పార్లెమెంటు సభ్యుడు కావడానికి కారణమైన నెల్లూరు ప్రజలను ఆదాల ప్రభాకర్ రెడ్డి పట్టించకోవడం లేదన్న విమర్శలున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి ఆయన నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. సొంత ట్రస్ట్ ల ద్వారా ప్రజాలకు నిత్యావసరవస్తువులను అందజేస్తున్నారు.

పార్టీ మారిన ఒక్క రోజులోనే…..

నిజానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి లక్కీ ఫెలో. టీడీపీ సీటు వచ్చినా దానిని కాదని చివరి నిమిషంలో వైసీపీలో చేరి నెల్లూరు పార్లమెంటు టిక్కెట్ ను పొందారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని కూడా కాదని ఒకరోజు ముందు పార్టీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి జగన్ టిక్కెట్ ఇచ్చారు. నెల్లూరులో పది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. సహజంగానే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా గెలిచారు. గత టీడీపీ ప్రభుత్వంలో వందకోట్ల రూపాయల బిల్లులను చంద్రబాబు ఇచ్చిన తర్వాతనే ఆదాల పార్టీ మారారన్న టాక్ అప్పట్లో విన్పించింది.

మంత్రులపై అసంతృప్తా….?

అయితే కష్టసమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి సేవకు దూరంగా ఉండటం విమర్శలకు తావిస్తుంది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు సేవా కార్యక్రమాల్లో మునిగితేలుతుండగా ఆదాల మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆదాల ప్రభాకర్ రెడ్డిపై విమర్శలతో కూడిన కామెంట్స్ కనపడుతున్నాయి. జిల్లాలో ఉన్న మంత్రుల పట్ల ఆదాల ప్రభాకర్ రెడ్డి అసంతృప్తిగా ఉండటమే దూరంగా ఉండటానికి కారణమని చెబుతున్నారు.

Tags:    

Similar News