achennaidu : అచ్చెన్న రాజసం అంతవరకేనట

అచ్చెన్నాయుడు సుదీర్ఘమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆ కుటుంబం రాజకీయ మొత్తం తెలుగుదేశం పార్టీతోనే ముడి వేసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీని వీడని కుటుంబం వారిది. [more]

Update: 2021-10-22 06:30 GMT

అచ్చెన్నాయుడు సుదీర్ఘమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆ కుటుంబం రాజకీయ మొత్తం తెలుగుదేశం పార్టీతోనే ముడి వేసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీని వీడని కుటుంబం వారిది. కింజారపు ఎర్నన్నాయుడు నుంచి రామ్మోహన నాయుడు వరకూ నిబద్ధతతో కూడిన రాజకీయం నడిపారు. ఇతర నేతల్లా పదవుల కోసం పక్క చూపులు చూడలేదు. అదే వారి కుటుంబానికి పాలిటిక్స్ లో కలసి వచ్చిందని చెప్పాలి.

అక్కడికే పరిమితం…

అయితే అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికయిన తర్వాత ఆయనను పార్టీ కేంద్ర కార్యాలయానికే పరిమితం చేశారు. ఆయన ఎక్కడా పర్యటించడానికి వీలులేదు. కనీసం సొంత జిల్లా శ్రీకాకుళంలో కూడా అన్ని నియోజకవర్గాలకు పార్టీ అధినాయకత్వం పర్మిషన్ లేకుండా వెళ్లడానికి వీలు లేదు. కేవలం పార్టీ నాయకత్వం సూచిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇటీవల సీమ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు అచ్చెన్నాయుడును ఆహ్వానించేందుకు రాగా ఆయన ఈ విషయం కుండబద్దలు కొట్టేశారు.

అందుకే పదవి….

అచ్చెన్నాయుడుకు తిరుపతి ఉప ఎన్నిక వరకూ చంద్రబాబు కూడా బాగానే గౌరవం ఇచ్చేవారు. ఆ కుటుంబానికి పార్టీతో ఉన్న అనుబంధం కారణంగా, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినందుకు, బీసీ అయినందుకు చంద్రబాబు అచ్చెన్నాయుడుకు పదవి ఇచ్చారు. మరో కారణం మూడు రాజధాననుల ప్రతిపాదన రావడంతో ఉత్తరాంధ్రకే తిరిగి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపడంతో అచ్చెన్నాయుడును వరించింది.

అప్పటి నుంచే….

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా లోకేష్ ను, పార్టీని ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించాయి. అప్పటి నుంచే అచ్చెన్నకు పగ్గాలు వేశారంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే. ఇక గత కొన్నాళ్లుగా జిల్లాల పర్యటనలను కూడా అచ్చెన్నాయుడు దూరంగా ఉంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడుకు జిల్లాల్లో పార్టీ పరంగా విస్తృత పర్యటనలు చేశారు. కానీ ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి, టెక్కలికే పరిమితమయ్యారు.

Tags:    

Similar News