మొత్తానికి అచ్చెన్న ను వెనక్కి నెట్టారే …!!

అసెంబ్లీలో ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు అధికారపక్షానికి తలపోటుగా మారారు. చంద్రబాబు పై ఏ మాత్రం ఈగ వాలకుండా తన వాగ్దాటితో అచ్చెన్న డామినేట్ చేస్తున్నారు. అలాగే [more]

Update: 2019-07-18 00:30 GMT

అసెంబ్లీలో ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు అధికారపక్షానికి తలపోటుగా మారారు. చంద్రబాబు పై ఏ మాత్రం ఈగ వాలకుండా తన వాగ్దాటితో అచ్చెన్న డామినేట్ చేస్తున్నారు. అలాగే ఏ విషయం చర్చకు వచ్చినా తెలివిగా టాపిక్ ను సైతం డైవర్ట్ చేసి మైండ్ గేమ్ ఆడేస్తున్నారు అచ్చెన్న. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే నడుస్తుందని కథ స్క్రీన్ ప్లే అంతా విపక్ష నేత అని గుర్తించింది అధికారపక్షం. దాంతో వ్యూహాత్మకంగా తమ మైండ్ గేమ్ తో ఆయన సీటు మార్చేసింది. వైసిపి ఇలా చేస్తుందని ఊహించని విపక్షం సీట్ల మార్పుపై పాత సంప్రదాయాలు పరిశీలించాలంటూ ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించి తదుపరి చర్య తీసుకుంటామని అప్పటివరకు తన రూలింగ్ పాటించాలని స్పీకర్ తమ్మినేని ఆదేశించడంతో టిడిపి వెనక్కి తగ్గక తప్పలేదు.

కోటంరెడ్డి ని అడ్డుపెట్టి ….

అచ్చెన్నాయుడు ను చంద్రబాబు పక్కన లేకుండా చేసే వ్యూహానికి వైసిపి పక్కాగా ప్లాన్ చేసింది. ముందుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో ఎక్కడ బడితే అక్కడ కూర్చోవడంతో స్పీకర్ సభ్యుల స్థానాలు ఖరారు చేశారు. ఆ క్రమంలో కింజరపు అచ్చెన్నాయుడు కు చంద్రబాబు వెనుక సీటు ఖారారు అయ్యింది. బాబు పక్క స్థానం అక్షర క్రమంలో మరో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి దక్కింది.

కోటంరెడ్డి మారాం చేయడంతో….

ఈ పరిణామం తో టిడిపి షాక్ కి గురైంది. అచ్చెన్న సైతం తనకు కేటాయించిన స్థానంలోకి వెళ్ళకుండా అలాగే కూర్చుండిపోయారు. దాంతో కోటంరెడ్డి చెలరేగిపోయారు. తాను కూడా నచ్చిన చోట కూర్చుంటా అంటూ మారాం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇతర నేతలంతా విపక్షం వైఖరిపై దాడి మొదలు పెట్టారు. స్పీకర్ రూలింగ్ ను విపక్షం ఎలా వ్యతిరేకిస్తారని అరగంటపాటు సీట్ల కోసం పోట్లాట సాగింది. చివరికి అచ్చెన్న వెనుక సీటుకు మారిన తరువాతే వాతావరణం చల్లబడింది.

Tags:    

Similar News