ధీటైన జవాబు… మంగళగిరి పప్పు కాదట ?

కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడితే ఆయన ప్రసంగ ధాటికి బెంబేలు ఎత్తాలిసిందే. టిడిపి అధికారంలో వున్నప్పుడు అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో ఆయన ఎప్పుడు అడిగినా స్పీకర్ మైక్ ఇవ్వడం [more]

Update: 2019-06-18 02:44 GMT

కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడితే ఆయన ప్రసంగ ధాటికి బెంబేలు ఎత్తాలిసిందే. టిడిపి అధికారంలో వున్నప్పుడు అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో ఆయన ఎప్పుడు అడిగినా స్పీకర్ మైక్ ఇవ్వడం విపక్షంపై తనదైన శైలిలో అచ్చెన్నాయుడు విరుచుకుపడటం జరిగేవి. విపక్షానికి మైక్ కట్ చేయడంతో సరైన కౌంటర్ ఇచ్చేవారు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అచ్చెన్న స్టైల్ లోనే దూకుడుగా విరుచుకుపడే వక్త వైసిపికి దొరికేశాడు. ఆయనే సాగునీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్. మాటలు తూటాల్లా పేల్చడంలో అచ్చెన్నాయుడు అందెవేసిన చెయ్యి. ఇప్పుడు అనిల్ కుమార్ ది అదే పంథా. ప్రత్యర్థిపై కౌంటర్ ఎటాక్ లతో విరుచుపడి సెటైర్లు విసరడంతో ఆయన దూకుడు అధికార పార్టీకి వరంగా, ప్రతిపక్షానికి శాపం గా మారింది.

అనిల్ టార్గెట్ లోకేష్ …

తాజాగా గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో విపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు మంత్రి అనిల్ ల మధ్య తీవ్ర స్థాయిలోనే మాటల యుద్ధం సాగింది. టిడిపి దూకుడు కి అడ్డుకట్ట వేసేందుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో విరుచుపడ్డారు. అనుభవంలేని యాదవ్ వంటివారికి పట్టిసీమ పోలవరం వంటి అంశాలపై మాట్లాడటంలో అర్ధం లేదంటూ అచ్చెన్నాయుడు గాలి తీసేసారు. అయితే అంతకన్నా ఎక్కువ స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. అనుభవం లేకపోయినా నేర్చుకుంటామని కానీ తానేమి మంగళగిరి పప్పును మాత్రం కాదన్నారు. లోకేష్ లా తానేమి దొడ్డి దారిన ప్రజలనుంచి గెలవకుండా రాలేదని దెప్పి పొడిచి అచ్చెన్నాయుడు కు షాక్ ఇచ్చారు. టాపిక్ లోకేష్ వైపు మళ్లడంతో వివాదం ఎక్కువైతే చర్చ అంతా తమ యువనేతపైనే నడుస్తుందని భావించి అచ్చెన్నాయుడు వెనక్కు తగ్గడం విశేషం.

Tags:    

Similar News