కళ్ళు తిరిగే ఆస్తులు … భయం లేకుండా?

పూరి జగన్నాధ్ పోకిరి సినిమాలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది. ల్యాండ్ సెటిల్ మెంట్స్ , మాఫియా తో చేతులు కలిపి సొమ్ములు గడించడం, స్థలాలు, పొలాలు, [more]

Update: 2020-09-24 09:30 GMT

పూరి జగన్నాధ్ పోకిరి సినిమాలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది. ల్యాండ్ సెటిల్ మెంట్స్ , మాఫియా తో చేతులు కలిపి సొమ్ములు గడించడం, స్థలాలు, పొలాలు, ప్లాట్ లు బంగారం, వెండి, నగదు పోగేసుకోవడం సదరు పాత్ర పోషించిన ఆశిష్ విద్యార్థి జీవించాడు ఆ సినిమాలో. సేమ్ టూ సేమ్ అలాంటి సీన్ హైదరాబాద్ ఎసిపి నరసింహారెడ్డి ఎపిసోడ్ లో రియల్ లైఫ్ లో ఎసిబి చూసి షాక్ అయ్యింది. సుమారు 75 కోట్ల రూపాయల ఆస్తులను మార్కెట్ విలువ ప్రకారం నరసింహారెడ్డి కూడబెట్టేశారు. ఒక మూడు అంతస్థుల కమర్షియల్ కాంప్లెక్స్, సైబర్ టవర్స్ దగ్గర నాలుగు ప్లాట్ లు, 55 ఎకరాల పొలం, ఇంకా తెరవని పలు లాకర్లు, 15 లక్షల రూపాయల నగదు, తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్ లు ఇలా తవ్వే కొద్ది నరసింహుని అవినీతి లీలలు అందరిని ఔరా అనిపిస్తున్నాయి.

ఎసిబి జలగల భరతం పట్టాలి …

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అవినీతి జలగలు రోజుకోటి బయటపడుతున్నాయి. ఎసిబి దాడి చేసిన వారిలో ఎవరిని టచ్ చేసినా కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పుచ్చి పోయిన అవినీతి వ్యవస్థకు ఈ కేసులు దర్పణంగా నిలుస్తున్నాయి. దాంతో ప్రభుత్వాలు మరింత సీరియస్ గా అవినీతి నిరోధక వ్యవస్థను పటిష్టం చేయాలిసిన అవసరం ఉంది. అదేవిధంగా ఎన్ని కేసులు బయటపడుతున్నా అక్రమార్కులు అదరక బెదరకుండా అవినీతి చీడను వదలకపోవడం ఆవేదన కలిగిస్తుంది. దశాబ్దాల తరబడి కేసులు సాగడం, సాక్ష్యాలు తారుమారు చేసి శిక్షల నుంచి అక్రమార్కులు తప్పించుకోవడం వల్లే అవినీతి పెచ్చరిల్లుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల నిర్దిష్ట సమయంలో ఈ కేసులు తేలి శిక్ష పడి వారి ఆస్తులను ప్రజాధనంగా స్వాధీనం చేసుకున్నప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుందేమో.

Tags:    

Similar News