అందుకే నచ్చాడట

ఢిల్లీ ఎన్నికల వేడి మామూలుగా లేదు. అయితే గెలుపోటముల అంచనాకు ఎవరూ రాలేకపోతున్నారు. ప్రధానంగా త్రిముఖ పోటీలా పైకి కన్పిస్తున్నా ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, [more]

Update: 2020-01-31 17:30 GMT

ఢిల్లీ ఎన్నికల వేడి మామూలుగా లేదు. అయితే గెలుపోటముల అంచనాకు ఎవరూ రాలేకపోతున్నారు. ప్రధానంగా త్రిముఖ పోటీలా పైకి కన్పిస్తున్నా ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యనే ఉండబోతుందన్నది వాస్తవం. అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు అన్నీ అనుకూలంగానే బయటకు కన్పిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా ఢిల్లీ గద్దెపై గంపెడాశలు పెట్టుకుంది.

కాంగ్రెస్ వైపునకు…..

ప్రధానంగా ఢిల్లీలో జరగుతున్న ఎన్నికలు పౌరసత్వ సవరణ చట్టం ప్రభావం చూపుతుందంటు న్నారు. సీఏఏ విషయంలో కాంగ్రెస్ పెద్ద గొంతుకతో అభ్యంతరం చెబుతున్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం సీఏఏను వ్యతిరేకిస్తున్నానని పదే పదే చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్లకుండా చూసుకోగలిగితే అరవింద్ కేజ్రీవాల్ విజయం మరోసారి ఖాయమన్నది విశ్లేషకుల అంచనా.

ప్రజావసరాలను గుర్తించి….

ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ సమూల మార్పులే తీసుకువచ్చారు. కొన్ని కీలక సమస్యలను ఆయన పరిష్కరించగలిగారు. ప్రధానంగా ఢిల్లీలో విద్యుత్తు, మంచినీరు సరఫరాను కేజ్రీవాల్ హయాంలో జరిగిందనే చెప్పాలి. నాణ్యమైన మంచినీటితో పాటు విద్యుత్తు సరఫారను కూడా ఆయన మెరుగుపర్చడంతో ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ పాలన పట్ల సంతృప్తి కరంగా ఉన్నారని పలు సర్వేల్లో స్పష్టమవుతోంది. విద్య, వైద్య రంగాల్లో కూడా గణనీయమైన మార్పులు తీసుకురాగలిగారు.

బీజేపీ వర్సెస్ ఆప్….

ఎన్నికలకు ముందు నుంచే అరవింద్ కేజ్రీవాల్ పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఉచిత కార్యక్రమాలతో పాటు సబ్సిడీలను కూడా బాగా పెంచారు. ఎన్నికల కోసమే అయినా ప్రజలు వీటి పట్ల బాగా ఆకర్షితులయ్యారన్నది ఒక అంచనా. దీంతో కేజ్రీవాల్ వైపే ఢిల్లీ ఓటరు మొగ్గు చూపుతారన్న అంచనాలయితే బలంగా ఉన్నాయి. మరోవైపు బీజేపీ సయితం ఎక్కడా పట్టు సడలకుండా పార్లమెంటు ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలనుకుంటుంది. మరి ఇద్దరి మధ్య పోటీ అన్నది స్పష్టమయినా గెలుపు ఎవరిదన్నది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News