వారినే… ఆ మంత్రి భుజానికెత్తేసుకుంటున్నారట

వైసీపీ స‌ర్కారులో కీల‌క మంత్రిగా ఉన్న ఓ నేత‌.. త‌న సామాజిక వ‌ర్గానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. త‌న వ‌ద్దకు వ‌చ్చేవారిని కూడా మీదేం [more]

Update: 2021-09-16 11:00 GMT

వైసీపీ స‌ర్కారులో కీల‌క మంత్రిగా ఉన్న ఓ నేత‌.. త‌న సామాజిక వ‌ర్గానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. త‌న వ‌ద్దకు వ‌చ్చేవారిని కూడా మీదేం కులం అని నిర్మొహ‌మాటంగా ప్రశ్నిస్తున్నార‌ట‌. త‌న సామాజిక వ‌ర్గం అయితే.. ఒక విధంగా.. కాక‌పోతే.. మ‌రో విధంగా రెస్పాండ్ అవుతున్నార‌ని.. సొంత పార్టీలోనే చ‌ర్చ సాగుతోంది. నిజానికి ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాత్రం.. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప‌ద‌వుల విష‌యంలోను.. ఇత‌ర‌త్రా అంశాల్లోనూ ఆయ‌న అన్ని కులాల నేత‌ల‌కు.. అధికారుల‌కు.. ప్రాధాన్యం క‌ల్పిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా త‌న సొంత సామాజిక వ‌ర్గం అయితేనా కొన్ని విష‌యాల్లో ప‌క్కన పెడుతున్నారు.

జగన్ వైఖరికి భిన్నంగా…

ఇక‌, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల‌కు జ‌గ‌న్ ఇస్తున్న ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. మ‌రి దీనిని బ‌ట్టి.. ఆయ‌న ఇస్తున్న సందేశం ఏంటి? అన్ని సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేయాల‌నే. ఈ క్రమంలోనే ఆయ‌న త‌న మంత్రివ‌ర్గంలోనే రెడ్లకు కేవ‌లం త‌క్కువ స్థానాలు కేటాయించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఎక్కువ అవ‌కాశం క‌ల్పించారు. అయితే.. దీనికి భిన్నంగా ఓ మంత్రి వ్యవ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయ‌న హిందూ మ‌త‌స్థుల‌కు చెందిన శాఖ‌కు మంత్రిగా ఉన్నారు. అయితే.. ఆయ‌న దూకుడు అంతా కూడా త‌న సామాజిక వ‌ర్గం వారివైపు మాత్రమే చూపిస్తున్నారు.

తన సామాజికవర్గానికి…

టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే అది కూడా త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌నే వైసీపీలోకి చేర్చేశారు. ఇక‌, కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో.. అస‌లు ఎస్సీ, బీసీల‌కు ఎక్కువ స్థానాలు ఇవ్వడంతో.. అగ్రవ‌ర్గాల‌కు అవ‌కాశం ద‌క్కుతుందా? అనుకునే ప‌రిస్థితిలో త‌న సామాజిక వ‌ర్గానికి రెండు కీల‌క చైర్మన్ పోస్టులు ఇచ్చుకునేలా చ‌క్రం తిప్పారు. ఇక‌, న‌గ‌ర‌పాల‌క సంస్థల‌కు చెందిన కార్పొరేష‌న్‌ల‌లోనూ త‌న సామాజిక వ‌ర్గానికి పెద్దపీట వేసుకునేలా చేస్తున్నారు. ఇలా.. ఎక్కడ అవ‌కాశం ఉంటే.. అక్కడ .. త‌న వారికి ప్రాధాన్యం ఇస్తుండ‌డం ఇప్పుడు వైసీపీలో ఈ మంత్రి గురించి చ‌ర్చకు దారితీసింది.

తన వర్గానికి మాత్రమే…

అయితే.. ఆయ‌న వ‌ర్గం మాత్రం ఇప్పటి వ‌రకు ఏ మంత్రి చేయ‌ని విధంగా.. త‌మ‌కు త‌మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి చేస్తున్నార‌ని మురిసి పోతున్నారు. కానీ, ఇది ఎన్నిక‌ల స‌మ‌యానికి విక‌టిస్తే.. స‌ద‌రు మంత్రి ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని.. వైసీపీలోనే చ‌ర్చ సాగుతుండ‌డ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ఇలానే వ‌దిలేస్తారా? లేక‌.. ఆ మంత్రిని లైన్‌లో పెడ‌తారా? అనేది ఆస‌క్తిగా మారింది

Tags:    

Similar News