జిత్తులమారి జిన్ పింగ్ …. అంతా రహస్యమే

గత నెలలో ‘గల్వాన్’ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు అమరులయ్యారు. మరెంతో మంది గాయపడ్డారు. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వారికి [more]

Update: 2020-07-20 16:30 GMT

గత నెలలో ‘గల్వాన్’ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు అమరులయ్యారు. మరెంతో మంది గాయపడ్డారు. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వారికి యావత్ జాతి ఘననివాళులు అర్పించింది, వారి త్యాగాలను కొనియాడింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజానీకం సైనికుల సేవలను ప్రస్తుతించింది. గాయపడ్డవారికి మెరుగైన వైద్యసౌకర్వం అందిస్తున్నారు. ఇదీ భారత్ లోని పరిస్ధితి. భారత ప్రభుత్వం, ప్రజలు అనుసరించిన విధానంపై అంర్జాతీయంగా ప్రశంసలు లభిస్తున్నాయి. సైనికుల పట్ల ప్రభుత్వ, ప్రజల చిత్తశుద్ధిని కొనియాడుతున్నారు.

మరిచైనా పరిస్ధితి ఏమిటి?

మరిచైనా పరిస్ధితి ఏమిటి? ఈ ఘర్షణల్లో ఎంతమంది చైనా సైనికులు మరణించారు? ఎంతమంది గాయపడ్డారు? బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించింది? గాయపడిన వారి పరిస్ధితి ఏమిటన్న ప్రశ్నలకు చైనా సర్కార్ నుంచి ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. ప్రభుత్వ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కుాడా ఈ విషయంలో గోప్యతను పాటిస్తోంది. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోంది ప్రభుత్వ వైఖరి వల్ల వీర జవాన్లకు నివాళులు అర్పించే అవకాశం లభించడంలేదని, వారి సేవలను, త్యాగాలను స్మరంచుకునే అవకాశం ఉండటం లేదని, వారి కుటుంబాలకు భారోసా ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని చైనీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత గోప్యతనను పాటించడం అవసరమా? అనివారు ప్రశ్నిస్తున్నారు. అధికారిక సమాచారం వల్ల తామూ వాస్తవాలను తెలుసుకో గలుగుతామని, లేనట్లయితే అవాస్తవాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది సరైన విధానం కాదని బీజింగ్ తీరుపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి పారదర్శకత కొరవడిందని వారు భావిస్తున్నారు.

యువకులనే ఎక్కువగా…..

గాల్వాన్ లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 30 నుంచి 45 మంది చైనా సైనికులు మరణించారన్నది వివిధ వార్తా సంస్ధల సమాచారం. చైనా ప్రభుత్వ, రక్షణ, విదేశాంగ శాఖ ప్రతినిధులు కానీ, అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ . . . ఈ విషయంపై మౌనం వహిస్తున్నాయి. అయితే తమ దేశానికి చెందిన ఒక కమాండింగ్ అధికారి చినపోయినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. అంతకు మించి ఒక్క ముక్క కూడా మాట్లేడేందుకు బీజింగ్ సుముఖంగా లేదు. ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో చైనా అధికారులు తమ కమాండింగ్ అధికారి మరణించిన విషయాన్ని అంగీకరించినట్లు సమాచారం. అధికారిక సమాచారం తెలిస్తే తాముా భారతీయుల మాదిరిగా సైనికుల త్యాగాలను స్మరించుకుంటామని, వారి కుటుంబాలకు భరోసా ఇస్తామని చైనీయులు చెబుతున్నారు. సరిహద్దుల్లో 20 నుంచి 25 ఏళ్ళ లోపు వయసుగల సైనికులనే చైనా ఎక్కువగా మెాహరిస్తుంది. యవ్వనంలో ఉన్న వారు చురుగ్గా పనిచేయగలరన్న ఉద్దేశంతో వారికి బాధ్యతలు అప్పచెబుతున్నారు.

అంతా గోప్యతే…..

ఇక చైనాలో ఒక్క సంతానానికే పరిమితం. అధిక జనాభా, కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఒక్కగానొక్క కుమారుడు బతుకుదెరువుకోసం సైన్యంలో చేరుతుండటంతో వారి మీద ఆధారపడ్డ తల్లితండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకవారు సరిహద్దు ఘర్షణల్లో చనిపోతే ఆయా కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులు చెప్పనలవి కావు. వారి మానసిక క్షోభను తీర్చేవారుండరు. ఈ పరిస్ధితుల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని చైనీయులు కోరుతున్నారు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం మెుదటినుంచి గొప్యత పాటిస్తూ వచ్చింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఇంటింటా అంతర్జాలం విస్తరించి, యావత్ ప్రపంచం ఒక కుగ్రామంగా మారుతున్న తరుణంలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎంతమాత్రం సరికాదని చైనీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి అసంతృప్తి, ఆవేదన బీజింగ్ పెద్టల దృష్టికి ఎలా వెళుతుందనేది అసలు ప్రశ్న.

చైనా

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News