స్పిన్నర్లపై భారీ షాట్స్ తో విరుచుకుపడిన విరాట్ కోహ్లీ

2022 ఆసియా కప్‌కు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.

Update: 2022-08-25 05:03 GMT

2022 ఆసియా కప్‌కు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ గా భారత్ టోర్నమెంట్ లో అడుగుపెట్టబోతోంది. ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. వరుసగా మూడవసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇక భారత జట్టులో విరాట్ కోహ్లీ ఫామ్ లేకపోవడం అటు అభిమానులను.. ఇటు జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతున్న అంశం. అందుకు తగ్గట్టుగా విరాట్ కోహ్లీ రాణించడానికి నెట్స్ లో చెమటోడుస్తూ ఉన్నాడు. మొదటి మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌ కూడా ప్రారంభించారు. ఇంగ్లండ్‌తో జరిగిన వైట్-బాల్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడగా.. ఆ తర్వాత వెస్టిండీస్-జింబాబ్వేతో జరిగిన తదుపరి సిరీస్‌లకు విశ్రాంతి తీసుకున్నాడు. 33 ఏళ్ల విరాట్ కోహ్లీ IPL 2022 లో 16 ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో 20 పరుగుల అత్యధిక స్కోరు మాత్రమే సాధించాడు.

బుధవారం నాడు దుబాయ్ లో అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్‌లో కష్టపడింది. విరాట్ కోహ్లీ కూడా నెట్స్ లో తన పని తాను చేశాడు. ప్రాక్టీస్ లో విరాట్ కోహ్లీ తన ఆట తీరుకు భిన్నంగా ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌ల బౌలింగ్ లో భారీ షాట్స్ ఆడాడు కోహ్లీ. విరాట్ కోహ్లీ పాకిస్థాన్ తో మ్యాచ్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాలని అందరూ ఎదురుచూస్తూ ఉంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైంది. కోహ్లీకి 100వ టీ20 కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక మైలురాయి. ప్రస్తుతానికి అతను ఎక్కువ పరుగులు చేయలేకపోతున్నా.. కోహ్లీ టాలెంట్ పై డౌట్ అనవసరం అని అంటున్నారు.

Full View


Tags:    

Similar News