పాక్ పై భారత్ విజయంపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏమన్నారంటే..?

ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించడం భారత అభిమానులకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది.

Update: 2022-08-29 03:20 GMT

ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించడం భారత అభిమానులకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. తద్వారా గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది.

పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిందని కొనియాడారు. ప్రత్యర్థిపై గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిన భారత జట్టుకు అభినందనలంటూ ట్వీట్ చేశారు. "TeamIndia put up a spectacular all-round performance in today's AsiaCup2022 match. The team has displayed superb skill and grit. Congratulations to them on the victory," అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
భారతదేశం సాధించిన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీమ్ ఇండియాను అభినందించారు. ఆసియా కప్ ను టీమ్ ఇండియా ఎంతో అద్భుతంగా ప్రారంభించింది. ఈ అద్భుత విజయం కోసం పోరాడిన మొత్తం జట్టుకు అభినందనలు. ఈ విజయాలను కొనసాగించాలని ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. "What a superb start by Team India at the #AsiaCup2022. This was such a nail-biting match. Congratulations to the entire team for this amazing victory. Keep it up!" అంటూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా.
కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా టీమ్ ఇండియాను అభినందించారు. ఇదొక 'అద్భుతమైన విజయం' అని పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించిన టీమిండియాకు హృదయపూర్వక అభినందనలని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్‌లో పేర్కొన్నారు. "Boys in Blue do it yet again! Score a spectacular victory against Pakistan in #AsiaCup2022 Tense moments but a clinical finish! Heartiest congratulations #TeamIndia," అంటూ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News