ఇండియా వర్సెస్ పాకిస్తాన్: మ్యాచ్ లో విన్నర్ ఎవరో చెప్పేసిన షేన్ వాట్సన్

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఈ ఏడాది ఆసియా కప్‌ను గెలుస్తుందని

Update: 2022-08-24 10:32 GMT

ఆసియా కప్ 2022లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ హై-ఆక్టేన్ పోరులో ఎవరు గెలుస్తారో అనే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ 2022 లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో మొదటి మ్యాచ్ లో ఆగస్టు 27న ఆతిథ్య శ్రీలంక జట్టు దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఆసియా కప్ శ్రీలంకలో జరగాల్సి ఉండగా.. అక్కడి పరిస్థితుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు టోర్నమెంట్ షిఫ్ట్ అయ్యింది. ఇక 28వ తేదీ భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 28న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అదే వేదికగా పాక్ జట్టు గత ఏడాది T20 ప్రపంచ కప్‌లో 10 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఇక T20 ప్రపంచ కప్ 2022లో అక్టోబర్ 24న మెల్‌బోర్న్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ లో కూడా మొదటి మ్యాచ్ తర్వాత కూడా పాక్ తో భారత్ ఇంకోసారి తలపడే అవకాశం ఉంది. గత సంవత్సరం T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ భారత్ పై భారీ విజయం సాధించినప్పటికీ, రాబోయే మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ గెలవడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని వాట్సన్ భావిస్తున్నాడు. "ఆసియా కప్ లో నేను ఊహించిన విజేత భారత్. వారు చాలా బలంగా ఉన్నారు. వారు కేవలం పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ ఉంటారు. కాబట్టి నేను విజేతగా భారత్‌ ను భావిస్తున్నాను" అని వాట్సన్ ది ఐసిసి రివ్యూలో పేర్కొన్నాడు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఈ ఏడాది ఆసియా కప్‌ను గెలుస్తుందని వాట్సన్ చెప్పుకొచ్చాడు. "మొదటి గేమ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ఎందుకంటే భారత జట్టును ఓడించగలమని పాకిస్తాన్‌కు ఇప్పుడు పూర్తి నమ్మకం ఉంది. నిజంగా ఆ గేమ్‌లో ఎవరు గెలిస్తే వారే ఆసియా కప్‌ను గెలుస్తారని నేను భావిస్తున్నాను" అని వాట్సన్ నొక్కి చెప్పాడు. నాకు ఇప్పుడే భారత్ టోర్నీ గెలుస్తుందనే భావన కలుగుతోంది. వారి బ్యాటింగ్ ఆర్డర్ చాలా విధ్వంసకరంగా ఉంది, కాబట్టి వారిని అదుపు చేయడం చాలా కష్టమని అన్నాడు వాట్సన్. ఆసియా కప్ టోర్నీలో భారత్, పాక్ జట్లు మూడుసార్లు తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Tags:    

Similar News