Ys Jagan : నేడు తెనాలికి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తెనాలిలో పర్యటించనున్నారు

Update: 2025-06-03 03:56 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తెనాలిలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి రానున్న జగన్ పోలీసుల దాడిలో గాయపడిన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తెనాలి పోలీసులు రౌడీషీటర్ల పేరుతో దారుణంగా కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జాన్ విక్టర్ కుటుంబాన్ని...
దీంతో జగన్ ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి లోని ఐతానగర్ కు చేరుకుంటారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెనాలి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.


Tags:    

Similar News