వంశీ కిడ్నాప్ వీడియోను విడుదల చేసిన టీడీపీ

టీడీపీ గన్నవరం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ బెదిరించిన వీడియోను బయటపెట్టింది.

Update: 2025-02-18 11:59 GMT

తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ బెదిరించిన వీడియోను తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. సత్యవర్థన్ ను వంశీ అనుచరులు తీసుకెళ్లి బెదిరించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసిన వీడియోను రిలీజ్ చేస్తూ కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పక్కా ఆధారాలతోనే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిందని తెలిపారు.

క్రిమినల్ ను అరెస్ట్ చేస్తే...
ఒక క్రిమినల్ ను అరెస్ట్ చేసే పరామర్శించేందుకు వెళ్లి పోలీసులను బెదిరించే విధంగా మాట్లాడతారా? ఇది మీకు సిగ్గుగా లేదా? అని జగన్ ను ప్రశ్నించారు. వంశీ వంటి క్రిమినల్ ను అరెస్ట్ చేస్తే పరామర్శ యాత్రకు వెళ్లి బట్టలూడదూసి కొడతామని బెదిరిస్తారా? అని కొల్లు రవీంద్ర నిలదీశారు. జగన్ బెదిరింపులకు టీడీపీ భయపడబోదని తెలిపారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని చేసే అరాచకాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.


Tags:    

Similar News