Tirupathi : తిరుపతిలో పోలీసుల విన్నూత్న ప్రయోగం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చలువ పందిళ్లు
తిరుపతి జిల్లా పోలీసులు ఎండ వేడికి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
తిరుపతి జిల్లా పోలీసులు ఎండ వేడికి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో వేసవికాలంలో ఎండ వేడికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహన దారుల ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి తగలకుండా ఈ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చలువ పందిళ్ళు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు.
ప్రధాన కూడలిలో...
నాలుగు ప్రధాన కూడలి లో రెండు నుండి మూడు నిముషాలు పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎండలో ద్విచక్ర వాహనాలు దారులు నిలబడాల్సి వస్తుంది.తీవ్రమైన ఎండ ఉండటం వల్లన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వృద్దులు, వికలాంగులు, మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తొలుత తిరుపతి లో భవాని నగర్ సర్కిల్, ఎన్ టీ ఆర్ సర్కిల్ వద్ద చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. నిజంగా దీనిని పోలీసు అధికారులను అభినందించాల్సిందే. ఇలా ఎర్పాటు చేయడం సంతోషంగా ఉందని ద్విచక్ర వాహనదారులు చెబుతున్నారు.