సింహాచలం ప్రమాదంపై నేడు ప్రాధమిక నివేదిక
సింహాచల అప్పన్న ఆలయంలో జరిగిన ఘటనలో ఏర్పాటయిన త్రిసభ్య కమిటీ నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది
సింహాచల అప్పన్న ఆలయంలో జరిగిన ఘటనలో ఏర్పాటయిన త్రిసభ్య కమిటీ నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా ఏడుగురుమరణించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు.
వారే బాధ్యులు...
ఈ కమిటీ రెండు రోజుల నుంచి సింహాచలంలో పర్యటించి కాంట్రాక్టర్ తో పాటు అధికారులను, ఆలయ సిబ్బందిని విచారించింది. గోడ కూలడానికి గల కారణాలను ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చిన కమిటీ నేడు ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. . ఆలయ ఈవో, టూరిజం, ఇంజనీరింగ్ అధికారులు అందరూ బాధ్యులే అంటూ విచారణలో గుర్తించినట్లు తెలిసింది.