Andhra Pradesh : వింత దొంగ.. దొంగతనం చేసిన సొమ్మును తిరిగి ఇచ్చి
అనంతపురం జిల్లాలో వింత దొంగ తాను దొంగతనం చేసిన డబ్బులను తిరిగి ఆలయంలో పెట్టి వెళ్లాడు
అనంతపురం జిల్లాలో వింత దొంగ తాను దొంగతనం చేసిన డబ్బులను తిరిగి ఆలయంలో పెట్టి వెళ్లాడు. బుక్కరాయ సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో దొంగతనం చేసిన తర్వాత కొన్ని రోజులకు తన ఇంట్లో పిల్లలకు బాగా లేకపోవడంతో దొంగతనం వల్లనే ఇలా జరిగిందని ఆ దొంగ భావించాడు.దీంతో తాను ఏ ఆలయంలో చోరీకి పాల్పడ్డాడో అక్కడే తాను చోరీ చేసిన నగదును పెట్టి వెళ్లాడు.
లేఖ కూడా రాసి...
దీంతో పాటు ఒక లేఖ కూడా పెట్టి వెళ్లాడు. తాను దొంగనం చేసిన నాటి నుంచి తన పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని, తన పిల్లలకు వైద్య ఖర్చుల కోసం కొంత సొమ్మును వాడుకున్నానని, మిగిలిన సొమ్ము తిరిగి ఇస్తున్నానని ఆ దొంగ లేఖలో పేర్కొనడం విశేషం. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలయ కమిటీ ఈ విషయం వెల్లడించింది.