తెనాలి నడి రోడ్డుపై వారిని బాదేసిన పోలీసులు!!

గుంటూరు జిల్లా తెనాలిలో నలుగురిని నడిరోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు.

Update: 2025-05-27 10:00 GMT

గుంటూరు జిల్లా తెనాలిలో నలుగురిని నడిరోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. రౌడీ షీటర్ అనుచరులు కానిస్టేబుల్ పై దాడి చేశారని అందుకే వారి అరికాలిపై లాఠీతో కొట్టినట్లు పోలీసులు తెలిపారు. నెల రోజుల క్రితం రౌడీ షీటర్ లడ్డూ అనుచరులు ఐతానగర్ లో తనపై దాడి చేశారని కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు చేశాడు.


రౌడీషీటర్ లడ్డూ అనుచరులు అయిన విక్టర్, బాబూలాల్, రాకేష్ గంజాయి మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేశారని కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన తెనాలి టూ టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఐతానగర్ తీసుకెళ్లి నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చారు పోలీసులు.

Tags:    

Similar News