TDP : కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ

మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2024-05-25 04:43 GMT

మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగువారిని కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 150 మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని చంద్రబాబు కోరారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగాల పేరుతో...
ఉద్యోగాల పేరుతో రాష్ట్ర యువతను అక్రమంగా కాంబోడియా తరలించారని చంద్రబాబు తెలిపారు. అక్రమంగా కాంబోడియా తరలించి సైబర్ క్రైమ్ ఉచ్చులోకి నెట్టారన్నారు. యువతను నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు జై శంకర్ కు రాసిన లేఖలో కోరారు.


Tags:    

Similar News