Road Accident : కావేరి ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్.. ముగ్గురి పరిస్థితి విషమం

ఆంధ్రప్రదేశ్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది

Update: 2025-11-18 04:19 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదానికి కారణం ప్రయివేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ దేనని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.

ఓవర్ టేక్ చేయబోయి...
లారీని ఓవర్ టేక్ చేయబోయి మరో లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురయిందని పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు బస్సు ఎడమ భాగం నుజ్జు నుజ్జు అయంది. రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News