Annadatha Sukhibhava Scheme : ఎంత మంది ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ అయ్యాయంటే?
అన్నదాత సుఖీఖవ పథకం కింద 99.98 శాతం మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని అధికారులు తెలిపారు
అన్నదాత సుఖీఖవ పథకం కింద 99.98 శాతం మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని అధికారులు తెలిపారు. నిన్న ప్రారంభమయిన నిధుల విడుదలతో 44.75 లక్షల మంది రైతులకు సాయం అందిందని వెల్లడించారు. అర్హులైన వారందరీకీ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులను జమ చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలుజమచేస్తామని తెలిపారు.
జమ కాని వారు...
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న ప్రాంతాల్లో జమ కాలేదని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కేవైసీ సమస్య, ఎన్‍పీసీలో చురుగ్గా లేని ఖాతాల్లో నిధులు జమకాలేదని, అలాగే వ్యవసాయశాఖ డేటా ప్రకారం కేవలం 1067 ఖాతాలకు మాత్రమే నగదు బదిలీ కాలేదని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. తిరస్కరణకు గురైన రైతులు గ్రామ రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు ఇవ్వవచ్చని సూచించారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వారు చెబుతున్నారు.
ఈ కారణంతోనే...
ఈ కేవైసీ చేసుకోని రైతులందరూ చేయించుకోవాలని తెలిపారు. స్థానికసంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన ప్రాంతాల్లో మాత్రం ఎన్నిక పూర్తయిన తర్వాత మాత్రమే జమ అవుతాయని చెబుతున్నారు. వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఐదు వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. అయితే అన్ని అర్హతలు ఉండి నిధులు కాని వారు కూడా వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి వినతి పత్రాలను సమర్పించవచ్చని తెలిపారు.