మరోసారి వార్తల్లో ఓబుళాపురం మైనింగ్.. శ్రీనివాస్ రెడ్డికి మూడేళ్ల జైలు శిక్ష

అటవీశాఖ అధికారి కల్లోల్ బిశ్వాస్ ను అడ్డుకున్న కేసు లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది

Update: 2022-05-20 08:36 GMT

అటవీశాఖ అధికారి కల్లోల్ బిశ్వాస్ ను అడ్డుకున్న కేసు లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది అనంతపురం రాయదుర్గం కోర్టు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి మూడేళ్లు జైలు శిక్ష పడింది. అటవీశాఖ అధికారి కల్లోల్ బిశ్వాస్‌ను అడ్డుకున్న కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ రాయదుర్గం కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలతో 2008లో ఓబుళాపురం గనుల తవ్వకం ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన అటవీ అధికారి బిశ్వాస్‌‌ను శ్రీనివాస్ రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఓబుళాపురం మైనింగ్:
ఓబులాపురం మైనింగ్ అక్రమాలు 2009లో బయటపడ్డాయి. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. కొన్ని వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న గాలి జనార్ధన్ రెడ్డితో పాటు, నాటి ఏపీ సీఎం వైఎస్ రాజరేఖర్ రెడ్డి హయాంలోని పలువురు ఐఏఎస్ అధికారులపై 2017లో సీబీఐ కోర్టు కేసు కొట్టేసింది. ఓబులాపురం మైనింగ్‌కు సంబంధించి మొత్తం 72 కేసులు నమోదవ్వగా.. సీబీఐ కోర్టు వీటిలో చాలావాటిని కోర్టు కొట్టేసింది. మరికొన్ని కేసుల్లో ఇంకా విచారణ కూడా ప్రారంభమవ్వలేదు. మైనింగ్ కేసులో ప్రధాన సాక్షులను భయపెట్టారనే కథనాలు కూడా వచ్చాయి.


Similar News