రేపు మురళి నాయక్ భౌతికకాయానికి అంత్యక్రియలు

పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన మురళి నాయక్ భౌతిక కాయం నేడు స్వగ్రామానికి చేరుకుంటుంది.

Update: 2025-05-10 04:46 GMT

పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన మురళి నాయక్ భౌతిక కాయం నేడు స్వగ్రామానికి చేరుకుంటుంది. మురళి నాయక్ స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లి తాండ. ఆ గ్రామానికి ఈరోజు రాత్రికి మురళి నాయక్ భౌతిక కాయం చేరుకునే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం మురళీనాయక్ భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం...
గుమ్మయ్యగారిపల్లి నుంచి భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం మురళీనాయక్ కు నివాళులర్పించనున్నారు. మురళి నాయక్ పాక్ జరిపిన కాల్పుల్లో మరణించిన నేపథ్యంలో అధికారిక, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు హాజరు కానున్నారు.


Tags:    

Similar News