నేడు తూర్పు గోదావరి జిల్లాలో నారాయణ పర్యటన
ఆరోజు కాకినాడ,అనకాపల్లి జిల్లాల్లో మంత్రి నారాయణ పర్యటించనున్నారు.
ఆరోజు కాకినాడ,అనకాపల్లి జిల్లాల్లో మంత్రి నారాయణ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొనున్నారు. అనంతరం ఉదయం 11.30 కు కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో జరిగే డీఆర్సీ సమావేశానికి నారాయణ హాజరు కానున్నారు.
రాత్రికి ఢిల్లీకి...
అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అనకాపల్లి జిల్లా యలమంచిలిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జరిగే డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో మంత్రి నారాయణ పాల్గొంటారు. రాత్రి తొమ్మిది గంటలకు విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారని మంత్రి నారాయణ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.