యువత కోసమే పెట్టుబడులు : నారా లోకేశ్

సింగపూర్ లో నైపుణ్యాభివృద్ధిపై జరిగిన వర్క్ షాప్‍లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

Update: 2025-07-29 04:16 GMT

సింగపూర్ లో నైపుణ్యాభివృద్ధిపై జరిగిన వర్క్ షాప్‍లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నైపుణ్యాలను సామర్థ్యాలుగా మార్చే విద్య జీవితాంతం ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలతో ఆంధ్రప్రదేశ్ యువతను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వేగవంతమైన ట్రాన్సఫర్మేషన్ కోసం సింగపూర్ తో కలిసి పనిచేస్తామని చెప్పారు.

నైపుణ్యాభివృద్ధి కోర్సులను...
ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విద్యా నైపుణ్యంతోపాటు పరిశ్రమల అవసరాలకు సిద్ధంగా ఉండేలా తయారుచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు.


Tags:    

Similar News