నేడు జనసేన శాసనసభ పక్షం కీలక సమావేశం

ఈరోజు జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది.

Update: 2025-02-23 02:58 GMT

ఈరోజు జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. జనసేన శాసనసభ పక్ష సమావేశం నేడు జరగనుండటంతో అందరూ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి.

అసెంబ్లీ సమాశాల్లో...
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో బడ్జెట్ సమావేశాలు కావడంతో ఏ ఏ సబ్జెక్ట్ పై ఎవరు మాట్లాడాలన్న దానిపై పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో వివరణ ఇవ్వనున్నారు. జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నార. బడ్జెట్ పై అవగాహనతో పాటు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై పవన్‌ కల్యాణ్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News