Vallabhaneni Vamsi : నేడు వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. అంతేకాదు అనారోగ్యం దృష్ట్యా తనకు ప్రత్యేకంగా బెడ్ తో పాటు ఇంటి నుంచి భోజనం అందేలా ఏర్పాటు చేయాలని పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మరొక వైపు వల్లభనేని వంశీని తమకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా పిటీషన్ వేశారు.
ఈ పిటీషన్లపై...
ఈ పిటీషన్లపై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధింపులు చేస్తున్నారని, ఆయనకు ప్రాణహాని ఉందని కూడా ఆయన తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అనేక కీలక అంశాలను రాబట్టేందుకు తమకు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరనున్నారు.