అమరావతిలో మరో అపురూప నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎన్ఆర్టీ సొసైటీ ఐకాన్ టవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా తీసుకుంది.

Update: 2025-02-22 06:46 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎన్ఆర్టీ సొసైటీ ఐకాన్ టవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని నియమించింది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటే గుర్తుండిపోయేలా నిర్మించే భవనం తరహాలో అమరావతిలోనూ ఒక ఐకానిక్ టవర్ ను నిర్మించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం.

ఇందుకోసం కమిటీ...
ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో తొమ్మిది మంది అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టును సర్కార్ నిర్మిస్తోంది.


Tags:    

Similar News