Janasena : జనసేన మాజీ ఎమ్మెల్యే పై వేటు
మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును కొవ్వూరు ఇన్ ఛార్జి పదవి నుంచి /జనసేన తప్పించింది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటుంది. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును కొవ్వూరు ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించింది. జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా టీవీ రామారావు వ్యవహరిస్తున్నారు. అయితే సహకారా సొసైటీల నియమాకాల్లో స్థానిక జనసేన నేతలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆయన ఆందోళనకు దిగారు.
ఆందోళనకు దిగారని...
కొవ్వూరు టోల్ గేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గంలో పథ్నాలుగు సొసైటీలు ఉంటే తమకు ఒక్కటే అప్పగించారని, మూడింటిలోనైనా జనసేన నేతలను నియమించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలతో ఆయన ఆందోళనకుదిగడం జనసేన సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఆయనను ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం నియామవళిని ఉల్లంఘించడమేనని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ లేఖలో తెలిపింది.