మాజీ మంత్రి విడదల రజనికీ రిలీఫ్

మాజీ మంత్రి విడదల రజనికి హైకోర్టులో ఊరట లభించింది

Update: 2025-04-25 12:14 GMT

మాజీ మంత్రి విడదల రజనికి హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు 41 ఎ నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రమే పేర్కొంది. విచారణకు విడదల రజనీ సహకరించాలని కూడా న్యాయస్థానం తెలిపింది. రజనితో పాటు ఆమె పీఏ రామకృష్ణకు కూడా 41 ఎ నోటీసులు ఇచ్చి విచారించాలని పేర్కొంది. స్టోన్ క్రషర్ యజమాని నుంచి రెండుకోట్ల రూపాయలకు పైగా బెదిరించి వసూలు చేశారంటూ రజని తో పాటు ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ముందస్తు బెయిల్ పై...
దీనిపై ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణకు సహకరించాలంటూనే ఎక్కడా కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది. అయితే ఈ కేసులో గోపిని అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలపడంతో గోపి పిటీషన్ ను న్యాయమూర్తి డిస్పోజ్ చేశారు. ఈ కేసులో గోపికి న్యాయస్థానం పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.


Tags:    

Similar News