Tirumala: తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు

Update: 2024-01-06 03:00 GMT

TTD

Tirumala :తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. స్వామివారిని 57,441 మంది భక్తులు దర్శించుకోగా 20,878 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గ‌త ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుండి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు శుక్ర‌వారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు. గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా ప్ర‌తి రోజు స్వామివారికి నివేదించారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు. శుక్ర‌వారం నాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ”తన్నీరముదు” ఉత్సవం నిర్వహించారు. అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటి రోజు అనగా జ‌న‌వ‌రి 6న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయానికి వేంచేస్తారు.


Tags:    

Similar News