Vallabhaneni Vamsi : నేడు తీర్పు.. ఏం రానుందో?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటీషన్ లపై నేడు న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటీషన్ లపై నేడు న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. తనకు జైలులో ప్రత్యేకంగా బెడ్, ఇంటి నుంచి ఆహారాన్ని అనుమతించాలని వల్లభనేని వంశీ తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. అనారోగ్యం కారణంగా తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరారు. ఈ పిటీషన్ లపై వాదనలు ముగిశాయి.
కస్టడీ పిటీషన్ పై...
మరొకవైపు వల్లభనేని వంశీని పది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసుల తరుపున న్యాయవాది పిటీషన్ వేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చే్స్తున్న సత్యవర్థన్ ను కిడ్నాప్, బెదిరింపులు చేశారని అరెస్ట్ చేయడంతో ఆయనను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు పిటీషన్లపై నేడు తీర్పు చెప్పనుంది.