Chandrababu : సింగపూర్ నుంచి బయలుదేరిన చంద్రబాబు
సింగపూర్ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరారు.
సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరారు. నాలుగు రోజుల పాటు 26 సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దే రారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ లోని తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరుతున్నారని తెలిసి ఆయన బసచేసిన హోటల్ కు తరలి వచ్చిన సింగపూర్ లోని తెలుగు ప్రజలు వచ్చి ఆయనకు సాదరంగా వీడ్కోలు పలికారు.
రాత్రికి ఉండవల్లికి...
సింగపూర్ లోని తెలుగు ప్రజల అభిమానానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెంటనే విజయవాడ బయల్దేరి వెళ్లనున్నారు. రాత్రి 11.30 గంటలకు ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. ఈ సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, మంత్రులు నారాయణ, టీజీ భరత్ లు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.