బంగాళాఖాతంలో తుపాను.. అప్రమత్తమైన ఏపీ యంత్రాంగం

తుపాను ప్రభావం 105 మండలాలపై ఉండవచ్చని భావిస్తున్నామని.. ఆయా మండలాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు.

Update: 2022-10-21 13:35 GMT

sitrang cyclone

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించిందని ఏపీ విపత్తునిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. సిత్రంగ్ గా చెబుతోన్న ఈ సైక్లోన్ ఈశాన్య దిశగా పయనిస్తూ.. ఒడిశా తీరాన్ని దాటి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను సమీపిస్తుందని ఆయన వివరించారు. తాజా అంచనాల ప్రకారం సిత్రంగ్ సైక్లోన్ ఏపీపై స్వల్ప ప్రభావం చూపుతుందని అంబేద్కర్ వెల్లడించారు.

తుపాను ప్రభావం 105 మండలాలపై ఉండవచ్చని భావిస్తున్నామని.. ఆయా మండలాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అలాగే తుపాను రీత్యా..బుధవారం (అక్టోబర్ 26) వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అంబేద్కర్ స్పష్టం చేశారు. ప్రజలు తుపాను ప్రభావాన్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయం, తుపాను సమాచారం కోసం 1070, 1800 4250101, 0863 2377118 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.




Tags:    

Similar News