సింగపూర్ లోనే మంత్రి నారాయణ
సింగపూర్ లో ఆంధ్రప్రదేశ్ మున్సిపాల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ పర్యటిస్తున్నారు
సింగపూర్ లో ఆంధ్రప్రదేశ్ మున్సిపాల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ పర్యటిస్తున్నారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించడానికి అవసరమైన పద్ధతులను అధ్యయనం చేస్తున్న మంత్రి నారాయణ ఈ రోజు ఉదయం సింగపూర్ లోని ఏఎల్బీఏ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు. ప్రజల నుంచి ఘన వ్యర్థాలను సేకరించి వివిధ రూపాలుగా ప్లాంట్ మార్చనుంది.
అధ్యయనం చేయడానికి...
ప్లాస్టిక్ వ్యర్థాలు,ఈ - వేస్ట్ ను రీ సైక్లింగ్ చేయడం,ఇతర వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పతి చేసే విధానాలను సింగపూర్ అధికారులు మంత్రి నారాయణకు వివరించారు. అత్యాధునిక వాహనాల ద్వారా చెత్త ను ఎలా సేకరిస్తున్నారో సింగపూర్ అధికారులు వివరించారు. ఆంధప్రదేశ్ లోనూ వేస్ట్ టు ఎనర్జీ,ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ చేయడంపై ఇప్పటికే ప్రభుత్వం ఫోకస్ పెట్టేందుకు సింగపూర్ లో అనుసరిస్తున్న పద్ధతులను నారాయణ అధ్యయనం చేస్తున్నారు.