నేడు పేదలకు లోకేశ్ శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు మంగళగిరిలో పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు.

Update: 2025-04-11 02:50 GMT

మంత్రి నారాలోకేశ్ నేడు మంగళగిరిలో పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుండి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్. పంపిణీ చేయనున్నారు. దీంతో పెద్దయెత్తున లబ్దిదారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

మంగళగిరిలో ఉన్న...
ఉదయం రత్నాల చెరువు - 600 మందికి, మధ్యాహ్నం మహానాడు వద్ద 430 మందికి మొత్తంగా 1030 మంది లబ్దిదారులకు ఈరోజు శాశ్వత ఇంటి పట్టాలు నారా లోకేష్ అందజేస్తారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. మంగళగిరిలో ఉన్న పేదలకు శాశ్వత ఇంటిపట్టాలను మంజూరు చేయడంతో పాటు వారి ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం అందచేయనుంది.


Tags:    

Similar News