. Nara Lokesh : ఎయిర్ బేస్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ
ఆంధప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వరసగా సింగపూర్ లో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు.
ఆంధప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వరసగా సింగపూర్ లో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఎయిర్‌బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో ఆంధ్రప్రదేశ్ నారా లోకేశ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ను విమానయాన రంగంలో ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే అద్భుత అవకాశాలపై లోతైన చర్చ జరిగింది. లోకేష్ మాట్లాడుతూ భారతదేశంలో విమానాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆగ్నేయాసియా మార్కెట్ల నుండి విమాన సేవలకు డిమాండ్ పెరుగుతోందని వివరించారు. ఈ పెరుగుదల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ సేవలకు భారీ మార్కెట్‌ను సృష్టిస్తుందని చెప్పారు.
ఎయిర్ బస్ సేవలతో...
ప్రస్తుతం భారతదేశంలో 850కి పైగా ఎయిర్‌బస్ విమానాలు సేవలందిస్తున్నాయని, ప్రపంచంలోనే ఎయిర్‌బస్‌కు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సింగిల్-కంట్రీ మార్కెట్‌గా భారత్ నిలిచిందని లోకేష్ తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో భారతదేశానికి 1,750 కొత్త విమానాలు అవసరమని అంచనా వేయబడిందని, ఇందులో A320 ఫ్యామిలీ విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారత వాణిజ్య విమానాల్లో దాదాపు 65 నుంచి 70 శాతం వరకు ఎయిర్‌బస్ విమానాలే ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.