Vallabhaneni Vamsii : నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై తీర్పు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. గన్నవరం పార్టీ కార్యాలయంలై దాడి కేసులో వల్లభనేని వంశీ తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు చెప్పనుంది. వల్లభనేని వంశీపై అనేక కేసులు వరసగా నమోదయ్యాయి.
వరస కేసులతో...
అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో అరెస్టయి వల్లభనేని వంశీ దాదాపు రెండున్నర నెలల నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు వల్లభనేని వంశీకి అనుకూలంగా తీర్పు వస్తుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారనుంది. కానీ ఈ కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు.