Andhra Pradesh : రైతులకు గుడ్‌న్యూస్....ఈ నెల 19న రైతుల ఖాతాల్లో డబ్బులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-11-17 12:53 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్‌ నిధుల జమకు రంగం సిద్ధం చేసింది. అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌ర‌కి అన్నదాత సుఖీభ‌వ పథకం అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టనుంది. రెండో విడతగా ఈనెల 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

కడప జిల్లాలో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిధులను రైతుల ఖాతాల్లో ఈ నెల 19న జమ చేయనున్నారు. కడప జిల్లా పర్యటనలోచంద్రబాబు ఈ నిధులను విడుదల చేయనున్నారు. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి చంద్రబాబు ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారని ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News